Opening Preview: Sahil Naik Special Story About Ground Zero - Sakshi
Sakshi News home page

గ్రౌండ్‌ జీరో హీరో

Published Fri, Jun 23 2023 5:12 AM | Last Updated on Fri, Jun 23 2023 1:19 PM

Opening Preview:  Sahil Naik special story about Ground Zero - Sakshi

కళారూ΄ాలు అద్భుతాలకు మాత్రమే పరిమితం కానక్కర్లేదని చెబుతాయి సాహిల్‌ నాయక్‌ మినీయేచర్‌లు.
అతడి కళాప్రపంచంలో నిర్మాణాల రూపంలో అసహాయుల హాహాకారాలు వినిపిస్తాయి. మహా నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీల జాడలు దొరుకుతాయి. పల్లకీ మోసిన బోయీల అడుగు జాడలు కనిపిస్తాయి....

గోవాలోని పొండలో పెరిగిన సాహిల్‌ నాయక్‌కు చిన్నప్పుడు ఒక్క దీపావళి పండగ వస్తే... వంద పండగలు వచ్చినంత సంబరంగా ఉండేది. రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారుచేసే పనుల్లో బిజీ బిజీగా ఉండేవాడు. చిన్నప్పుడు నేర్చుకున్న బొమ్మలకళ ఊరకే పోలేదు. భవిష్యత్‌లో స్కల్ప›్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోడానికి పునాదిగా నిలిచింది.

బరోడాలోని ఎంఎస్‌ యూనివర్శిటీలో చదువుకున్న సాహిల్‌ తన డెబ్యూ సోలో ఎగ్జిబిషన్‌ను ఆ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి షో కోల్‌కత్తాలోని ఎక్స్‌పెరిమెంటల్‌ గ్యాలరీలో జరిగింది. ‘గ్రౌండ్‌ జీరో’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లోని మినీయేచర్‌లు కళాభిమానులను ఆకట్టుకున్నాయి.
సాహిల్‌ కళాప్రపంచం గురించి చె΄్పాలంటే... అందానికి, అద్భుతానికి మాత్రమే పరిమితమై ఉంటే ‘గ్రౌండ్‌ జీరో’లో విశేషం ఉండేది కాదేమో!

సాహిల్‌ మినీయేచర్స్‌ను ‘ఆర్టిస్టిక్‌ రిప్రెంజటేషన్‌’కు మాత్రమే పరిమితం చేయడం సరికాదేమో అనిపిస్తుంది.  ఎందుకంటే సాహిల్‌ కళా ప్రపంచంలో యుద్ధానంతర, ప్రకృతి విలయం తరువాత కట్టడాల కళ్లలో కనిపించే దైన్యం కదిలిస్తుంది. ప్రశ్నిస్తుంది.
ప్రకృతి విలయాల తరువాత దృశ్యాలపై ఆసక్తితో వందలాది ఫొటోలను అంతర్జాలంలో చూసేవాడు. పాత పుస్తకాల్లో దృశ్యాల వెంట వెళ్లేవాడు సాహిల్‌.


అద్భుతమైన ఆర్కిటెక్చర్‌ కొలువుదీరిన ఊళ్లను వెదుక్కుంటూ వెళ్లేవాడు. ఈ ప్రయాణంలో తనకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన గ్రామాల్లో ఒకటి గోవాలోని కుర్దీ. డ్యామ్‌ నిర్మాణం వల్ల ఈ ఊళ్లోని వాళ్లు నిరాశ్రయులు అయ్యారు. ఎక్కడెక్కడికో వెళ్లి బతుకుతున్న వాళ్లు  వేసవి సమయంలో మాత్రం తమ ఊరి ఆనవాళ్లను చూసుకోవడానికి తప్పకుండా వస్తారు. శిథిలమై, చిరునామా లేని ఊరిని తన కళలోకి తీసుకువస్తాడు సాహిల్‌.

టెక్ట్స్, క్లిప్స్, రి΄ోర్ట్‌... తన అన్వేషణలో ఏదీ వృథా పోయేది కాదు. కొన్ని కట్టడాలను ఆర్ట్‌కి తీసుకురావడానికి ప్రత్యేకమైన పరికరాలను ఆశ్రయించడమో, తయారుచేయడమో జరిగేది.


‘ఆర్కిటెక్చర్‌ అనేది కళ కంటే ఎక్కువ. చరిత్రకు మౌనసాక్షి’ అంటాడు సాహిల్‌. ఆ మౌన సాక్షిని తన కళతో అనర్ఘళంగా మాట్లాడించడం సాహిల్‌ ప్రత్యేకత!
‘మాన్యుమెంట్స్, మెమోరియల్‌ అండ్‌ మోడ్రనిజం’ పేరుతో చేసిన సెకండ్‌ సోలో షోకు కూడా మంచి స్పందన లభించింది. చాలా మంది సాహిల్‌  మొదటి షో ‘గ్రౌండ్‌ జీరో: సైట్‌ యాజ్‌ విట్‌నెస్‌/ఆర్కిటెక్చర్‌ యాజ్‌ ఎవిడెన్స్‌’ తో ΄ోల్చుకొని మంచి మార్కులు వేశారు. ‘ఎక్కడా తగ్గలేదు’ అని ప్రశంసించారు.

కోల్‌కత్తాలో జరిగినా, అక్కడెక్కడో జ΄ాన్‌లోని కాంటెంపరరీ ఆర్ట్స్‌ సెంటర్‌లో జరిగినా సాహిల్‌ ఎగ్జిబిషన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఒక్కటే.
‘మన ఆలోచనల్లో ఉండే సంక్లిష్టతను కళలోకి తీసుకురావడం అంత తేలిక కాదు. సాహిల్‌ మాత్రం ఆ క్లిష్టమైన పనిని తేలిక చేసుకున్నాడు’ అంటారు ‘ఖోజ్‌’ గ్యాలరీ క్యూరెటర్, ్ర΄ోగ్రామ్‌ మేనేజర్‌ రాధ మహేందు. గోవాలో మొదలైన సాహిల్‌ ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే ‘గౌండ్‌ జీరో’ రూపంలో గ్రౌండ్‌ రియాలిటీకి ఎప్పుడూ దూరం కాలేదు. అదే అతడి విజయ రహస్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా!
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement