Sahil
-
ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా
ఆస్ట్రేలియా యువ జట్టుపై భారత అండర్-19 క్రికెట్ టీమ్ ఘన విజయం సాధించింది. రెండో యూత్ వన్డేలో కంగారూ టీమ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఆసీస్ అండర్-19 జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది.ఇందులో భాగంగా.. పుదుచ్చేరిలో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో వన్డేలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. పుదుచ్చేరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్ల జోరు.. కంగారూ బ్యాటర్లు బేజారుకంగారూ టీమ్‌లో అడిసన్ షెరిఫ్(39), క్రిస్టియన్ హోవే(28) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా కేవలం 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహ్మద్ ఎనాన్, కిరణ్ చోర్మాలే రెండేసి వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హార్దిక్ రాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సాహిల్ పరేఖ్ ధనాధన్ సెంచరీఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అండర్-19 జట్టు 22 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్ సాహిల్ పరేఖ్ 75 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రుద్ర పటేల్(10) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు.. సాహిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 50 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. సాహిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.సిరీస్ భారత్ కైవసంవీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత యువ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. సాహిల్ పరేఖ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.తుదిజట్లుభారత్రుద్ర పటేల్, సాహిల్ పరేఖ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), మహ్మద్ అమాన్ (కెప్టెన్), కె.పి.కార్తికేయ, కిరణ్ చోర్మాలే, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, మొహ్మద్ ఎనాన్, యుధాజిత్ గుహ,సమర్థ్ నాగరాజ్.ఆస్ట్రేలియారిలే కింగ్సెల్, జాక్ కర్టెన్, అడిసన్ షెరిఫ్, ఆలివర్ పీక్ (కెప్టెన్), అలెక్స్ లీ యంగ్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ హోవే, లింకన్ హాబ్స్, హ్యారీ హోక్స్ట్రా, లాచ్లాన్ రానాల్డో, హేడెన్ షిల్లర్, విశ్వ రామ్ కుమార్.చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు! -
గ్రౌండ్ జీరో హీరో
కళారూ΄ాలు అద్భుతాలకు మాత్రమే పరిమితం కానక్కర్లేదని చెబుతాయి సాహిల్ నాయక్ మినీయేచర్లు. అతడి కళాప్రపంచంలో నిర్మాణాల రూపంలో అసహాయుల హాహాకారాలు వినిపిస్తాయి. మహా నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీల జాడలు దొరుకుతాయి. పల్లకీ మోసిన బోయీల అడుగు జాడలు కనిపిస్తాయి.... గోవాలోని పొండలో పెరిగిన సాహిల్ నాయక్‌కు చిన్నప్పుడు ఒక్క దీపావళి పండగ వస్తే... వంద పండగలు వచ్చినంత సంబరంగా ఉండేది. రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారుచేసే పనుల్లో బిజీ బిజీగా ఉండేవాడు. చిన్నప్పుడు నేర్చుకున్న బొమ్మలకళ ఊరకే పోలేదు. భవిష్యత్‌లో స్కల్ప›్టర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోడానికి పునాదిగా నిలిచింది. బరోడాలోని ఎంఎస్ యూనివర్శిటీలో చదువుకున్న సాహిల్ తన డెబ్యూ సోలో ఎగ్జిబిషన్‌ను ఆ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి షో కోల్‌కత్తాలోని ఎక్స్పెరిమెంటల్ గ్యాలరీలో జరిగింది. ‘గ్రౌండ్ జీరో’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లోని మినీయేచర్లు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. సాహిల్ కళాప్రపంచం గురించి చె΄్పాలంటే... అందానికి, అద్భుతానికి మాత్రమే పరిమితమై ఉంటే ‘గ్రౌండ్ జీరో’లో విశేషం ఉండేది కాదేమో! సాహిల్ మినీయేచర్స్ను ‘ఆర్టిస్టిక్ రిప్రెంజటేషన్’కు మాత్రమే పరిమితం చేయడం సరికాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాహిల్ కళా ప్రపంచంలో యుద్ధానంతర, ప్రకృతి విలయం తరువాత కట్టడాల కళ్లలో కనిపించే దైన్యం కదిలిస్తుంది. ప్రశ్నిస్తుంది. ప్రకృతి విలయాల తరువాత దృశ్యాలపై ఆసక్తితో వందలాది ఫొటోలను అంతర్జాలంలో చూసేవాడు. పాత పుస్తకాల్లో దృశ్యాల వెంట వెళ్లేవాడు సాహిల్. అద్భుతమైన ఆర్కిటెక్చర్ కొలువుదీరిన ఊళ్లను వెదుక్కుంటూ వెళ్లేవాడు. ఈ ప్రయాణంలో తనకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన గ్రామాల్లో ఒకటి గోవాలోని కుర్దీ. డ్యామ్ నిర్మాణం వల్ల ఈ ఊళ్లోని వాళ్లు నిరాశ్రయులు అయ్యారు. ఎక్కడెక్కడికో వెళ్లి బతుకుతున్న వాళ్లు వేసవి సమయంలో మాత్రం తమ ఊరి ఆనవాళ్లను చూసుకోవడానికి తప్పకుండా వస్తారు. శిథిలమై, చిరునామా లేని ఊరిని తన కళలోకి తీసుకువస్తాడు సాహిల్. టెక్ట్స్, క్లిప్స్, రి΄ోర్ట్... తన అన్వేషణలో ఏదీ వృథా పోయేది కాదు. కొన్ని కట్టడాలను ఆర్ట్‌కి తీసుకురావడానికి ప్రత్యేకమైన పరికరాలను ఆశ్రయించడమో, తయారుచేయడమో జరిగేది. ‘ఆర్కిటెక్చర్ అనేది కళ కంటే ఎక్కువ. చరిత్రకు మౌనసాక్షి’ అంటాడు సాహిల్. ఆ మౌన సాక్షిని తన కళతో అనర్ఘళంగా మాట్లాడించడం సాహిల్ ప్రత్యేకత! ‘మాన్యుమెంట్స్, మెమోరియల్ అండ్ మోడ్రనిజం’ పేరుతో చేసిన సెకండ్ సోలో షోకు కూడా మంచి స్పందన లభించింది. చాలా మంది సాహిల్ మొదటి షో ‘గ్రౌండ్ జీరో: సైట్ యాజ్ విట్నెస్/ఆర్కిటెక్చర్ యాజ్ ఎవిడెన్స్’ తో ΄ోల్చుకొని మంచి మార్కులు వేశారు. ‘ఎక్కడా తగ్గలేదు’ అని ప్రశంసించారు. కోల్‌కత్తాలో జరిగినా, అక్కడెక్కడో జ΄ాన్లోని కాంటెంపరరీ ఆర్ట్స్ సెంటర్లో జరిగినా సాహిల్ ఎగ్జిబిషన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఒక్కటే. ‘మన ఆలోచనల్లో ఉండే సంక్లిష్టతను కళలోకి తీసుకురావడం అంత తేలిక కాదు. సాహిల్ మాత్రం ఆ క్లిష్టమైన పనిని తేలిక చేసుకున్నాడు’ అంటారు ‘ఖోజ్’ గ్యాలరీ క్యూరెటర్, ్ర΄ోగ్రామ్ మేనేజర్ రాధ మహేందు. గోవాలో మొదలైన సాహిల్ ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే ‘గౌండ్ జీరో’ రూపంలో గ్రౌండ్ రియాలిటీకి ఎప్పుడూ దూరం కాలేదు. అదే అతడి విజయ రహస్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! -
కాదన్నందుకే కడతేర్చాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నడిరోడ్డుపై పదహారేళ్ల బాలికను అత్యంత పాశవికంగా 20సార్లకుపైగా పొడిచి, సిమెంట్ శ్లాబ్‌తో పుర్రె పగిలేలా మోదిన ఉదంతంలో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు సాహిల్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం తాలూకు పలు అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హత్య నేరాన్ని పోలీసుల విచారణలో సాహిల్ ఒప్పుకున్నాడు. పక్కా ప్రణాళికతోనే అదే చోట చంపాలని ముందే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. సన్నిహితంగా ఉండే బాలిక సాక్షి తనను దూరంగా పెట్టడం సాహిల్‌కు నచ్చలేదు. బంధం కొనసాగించాలని కోరగా తన స్నేహితురాళ్ల సమక్షంలోనే సాక్షి ఇతడిని తిరస్కరించింది. సన్నిహితంగా ఉండాలని బలవంతం చేస్తే చితకబాదుతామని సాక్షి స్నేహితులు సాహిల్‌ను హెచ్చరించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని 15 రోజుల క్రితమే హరిద్వార్ నుంచి తీసుకొచ్చాడు. హత్య చేశాక పారిపోతూ కత్తిని రిఠాలా మెట్రో స్టేషన్ దగ్గరి పొదల్లో పడేశాడు. తర్వాత బులంద్‌షహర్‌లోని తన అత్తయ్య ఇంటికి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాక ఇంటికి ఫోన్‌చేశాడు. ఆ ఫోన్‌కాల్ సాయంతో జాడ కనిపెట్టి పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. సాక్షి శరీరంపై 34 లోతైన గాయాలు ఉన్నాయని, పుర్రె పగిలిందని పోలీసులు వెల్లడించారు. 2021 జూన్ నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉండగా విడిపోదామని ఇటీవల చెప్పడంతో గత ఎనిమిదిరోజులుగా వారి మధ్య గొడవలు అవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడైన తన మాజీ ప్రియుడితో మళ్లీ టచ్‌లోకి రావడంతోనే గొడవ పెరిగిందని సాహిల్ చెప్పాడు. కాగా, సాక్షి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
పిట్ట కొంచెం.. ప్రయోగాలు ఘనం.. అమెరికాలో ప్రతిభ
సాక్షి, అమరావతి: కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఏ వ్యక్తినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇదే స్ఫూర్తితో ఆంధ్రా యువకుడు పిన్న వయస్సులోనే అమెరికాలో తన ప్రతిభను చాటుతున్నాడు. గుంటూరు జిల్లా అమరావతికి చెంది అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు తల్లం శ్రీనివాస కిరణ్, వెంకట పల్లవి కుమారుడు సాహిల్ (17) మూడు సాఫ్ట్వేర్ ఆవిష్కరణలకు రూపకల్పన చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో అతని ఆలోచనలు భారత్, అమెరికా దేశాలకు ఉపయుక్తమైన ఆవిష్కరణలకు అంకురార్పణ చేశాయి. ఆ కొత్త ఆవిష్కరణలు ఇవే.. అడవుల పెంపకానికి ఇ–ప్లాంటేషన్ డ్రోన్ కాలిఫోర్నియాలోని అడవులను కార్చిచ్చు తరచూ నాశనం చేస్తుండడంతో తల్లడిల్లిన సాహిల్ ఆ భూముల్లో తిరిగి మొక్కలు పెంచేందుకు (రీ ఫారెస్టేషన్) సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానిస్తూ డ్రోన్లను రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా అడవుల పునర్నిర్మాణ లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాడు. బహుళ రకాలుగా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. అడవులు, మైదాన ప్రాంతాల్లో మనుషులు, యంత్రాల సాయంతో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను ఇవి గుర్తిస్తాయి. మనుషులు వెళ్లలేని అటవీ ప్రాంతాల్లో ఈ డ్రోన్లే మొక్కలు నాటి నీళ్లుపోసి సంరక్షిస్తాయి. స్మార్ట్ సాగులో ‘ఇ–ప్లాంటేషన్’ విధానం ఇది. ఇందుకోసం ప్రతీ డ్రోన్ ఒకదానికొకటి అనుసంధానించుకుని పనిచేస్తాయి. తుపాకులను గుర్తించే సాఫ్ట్వేర్ తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లిన ప్రాంతాల్లోని పాఠశాలల్లో నిఘా, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా సాహిల్ ఓ సాఫ్ట్వేర్ రూపొందించాడు. తుపాకీ, ఇతర మారణాయుధాలతో ప్రాంగణంలోకి వచ్చినా గుర్తించగలిగే సాఫ్ట్వేర్ ఆధారిత మైక్రో–కెమెరా వ్యవస్థను తాను చదివిన కాలిఫోర్నియాలోని శాన్ రామన్ డౌగెర్టీ వ్యాలీ హైస్కూల్లో ఏర్పాటుచేసి అధ్యాపకుల ప్రశంసలు అందుకున్నాడు. నిర్దేశిత ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచి పసిగట్టే సైన్స్ ఫిక్షన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇది. అంధులకు స్మార్ట్ గ్లాస్ అంధులలో దృష్టిలోప నివారణకు సాహిల్ స్మార్ట్ కళ్లజోళ్లు రూపొందించాడు. ఈ కళ్లద్దాల్లో కెమెరా, మైక్, సెన్సార్, స్పీకర్లు ఉంటాయి. వీటికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ను అనుసంధానించాడు. ఇవి ఎదురుగా కన్పించే దృశ్యాలను చిత్రీకరించి ప్రత్యేక సెన్సార్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. స్పీకర్ల ద్వారా వీటిని ధరించిన అంధులకు తెలియజేస్తుంది. సాహిల్ ప్రత్యేకతలు మరికొన్ని.. ► లాక్డ్ రెడీ సెక్యూర్ (ఎల్ఆర్ఎస్) కంపెనీ సీఈఓగా అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీని తెలుసుకోగల నిఘా కెమెరాలను రూపొందించాడు. ► సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం మీడియా అప్లికేషన్లకు రూపకల్పన చేశాడు. ► అమెరికాలో వెబ్ డెవలపర్‌గా యూనిఫైడ్ స్పోర్ట్స్ ఇంటర్న్‌షిప్ పూర్తిచేశాడు. ► భారత్‌లో కృత్రిమ మేథా ప్రాజెక్టు రూపకల్పనలో మెంపేజ్ టెక్నాలజీస్‌కు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాడు. ► తన డ్రోన్ ప్రాజెక్ట్‌తో ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ ఇమాజిన్ కప్ పోటీల్లో సెమీఫైనల్స్‌కు చేరాడు. ► లింగ్ హక్స్ మేజర్ లీగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టి మూడో స్థానంలో నిలిచాడు. ► బెమాక్స్ కంపెనీతో చేపట్టిన సోలార్ హాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌కు ఉత్తమ అవార్డు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ► 2018లో లూయిస్విల్లేలో జరిగిన వెక్స్ గ్లోబల్ కాంపిటీషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌లో 3వ స్థానం సాధించాడు. -
చిన్నారులను చేరదీసిన రైల్వే పోలీసులు
రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు చిన్నారులను కాచిగూడ రైల్వే పోలీసులు చేరదీసి 1098 దివ్యదిశ స్వచంద సేవా సంస్థకు అప్పగించారు. రైల్వే ఎస్ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం... సైయిదా (4) తండ్రి నిఖా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన అసన్ (12) తండ్రి అక్భర్, సాహిల్ (8) తండ్రి మోహీదుద్దీన్లు కాచిగూడ రైల్వే స్టేషన్లో గురువారం తిరుగుతుండగా వారిని చేరదీశారు. రైల్వే పోలీసులు వివరాలు నమోదు చేసుకుని వారిని బాలల వసతి గృహానికి పంపించారు.