శ్రీశైలంలో పనుల పర్యవేక్షణకు లోకాయుక్త కమిటీ | lokayukta committee for srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పనుల పర్యవేక్షణకు లోకాయుక్త కమిటీ

Published Fri, May 16 2014 12:16 AM | Last Updated on Sat, Mar 9 2019 3:50 PM

lokayukta committee for srisailam

 శ్రీశైలం, న్యూస్‌లైన్: కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పరిధిలో ఈఓ ఆజాద్ చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర లోకాయుక్త ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయప్రాంగణంలో, వెలుపల భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న, ఇప్పటికే నిర్మించిన కట్టడాల పరిశీలన తదితర అంశాలను పర్యవేక్షించడానికి కమిటీ ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ కమిటీలో విశ్రాంత ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , డెరైక్టర్ ఆఫ్ ఇన్వేస్టిగేషన్ నరసింహారెడ్డి, స్థానిక తహశీల్దార్ మల్లికార్జున, స్థానిక సీఐ వేణుగోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉంటారన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు వివిధ ప్రదేశాలలో జరుగుతున్న పనులపై ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement