మాయావతి ప్రభుత్వానికి లోకాయుక్త క్లీన్చిట్ | Lokayukt N K Mehrotra gives clean chit to previous Mayawati government | Sakshi
Sakshi News home page

మాయావతి ప్రభుత్వానికి లోకాయుక్త క్లీన్చిట్

Published Tue, Nov 12 2013 3:07 PM | Last Updated on Sat, Mar 9 2019 3:50 PM

మాయావతి ప్రభుత్వానికి లోకాయుక్త క్లీన్చిట్ - Sakshi

మాయావతి ప్రభుత్వానికి లోకాయుక్త క్లీన్చిట్

ఉత్తర ప్రదేశ్ : బీఎస్పీ అధినాయకురాలు మాయావతికి లోకాయుక్తా క్లీన్చిట్ ఇచ్చింది. మాయావతి పార్టీ తరఫున నిర్వహిస్తున్న ట్రస్టుకు కేంద్రం కేటాయించిన భవంతులను నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేసిన అంశంపై ఆమె ప్రభుత్వానికి క్లీన్చిట్ లభించింది.  ఈ ఉదంతంపై ఫిర్యాదులు రావడంతో ఉత్తర ప్రదేశ్ లోకాయుక్త విచారణకు స్వీకరించింది. ఈ మేరకు విచారించిన జడ్జి ఎన్.కె.మెహరోత్రా.. మాయావతి ప్రభుత్వంలో భవంతులు అంశానికి సంబంధించి ఎటువంటి అవతవకలు జరగలేదని పేర్కొన్నారు.

 

ఢిల్లీలో పార్లమెంటుకు చేరువలోని అత్యంత కీలక ప్రాంతమైన గురుద్వారా రఖాబ్‌గంజ్ రోడ్డులో కేంద్రం బీఎస్పీ అధినాయకురాలికి, ఆమె పార్టీకి, పార్టీకి చెందిన ట్రస్టుకు మూడు భవనాలను కేటాయించింది. మూడు భవనాలకు వేరుగా ఇదే ప్రాంతంలో మాయావతికి మరో భవంతి కూడా ఉంది. అయితే, మాయావతి కేంద్రం కేటాయించిన మూడు భవంతులను విలీనం చేసి, ఒకే భారీ భవంతిగా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని సమాచార హక్కు కార్యకర్త సుభాష్ అగ్రవాల్ దీనిపై దరఖాస్తు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement