పుష్కరాల సమయంలో నగర సుందరీకరణలో, భోజనాల బిల్లుల విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఈ విషయం గురించి లోకాయుక్త, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ సమావేవంలో చర్చించి బిల్లులను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు తెలిపినా సరిగా స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఇంచార్జి కమిషనర్ సకలారెడ్డి ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
పుష్కర అవినీతిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తా
Published Sat, Sep 26 2015 1:04 PM | Last Updated on Mon, Oct 22 2018 8:57 PM
Advertisement
Advertisement