the BJP
-
‘స్కామ్’ పార్టీలను వదిలించుకోండి
► ఓటర్లకు మోదీ పిలుపు ► ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’గా అభివర్ణన మీరట్: ఉత్తరప్రదేశ్‌ను అవినీతి పార్టీల నుంచి విముక్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను కోరారు. నోట్ల రద్దుతో తాను అవినీతిపరులను ‘దోచుకోవడం’తో వారు తనను అధికారం నుంచి దించేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ శనివారం మీరట్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల సభతో తొలిసారి తన ప్రచారాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘యూపీని స్కామ్.. ఎస్ అంటే సమాజ్‌వాదీ, సీ అంటే కాంగ్రెస్, ఏ అంటే అఖిలేశ్, ఎం అంటే మాయావతి పార్టీల నుంచి విముక్తం చేయండి’ అని కోరారు. బీజేపీ అభివృద్ధి ఎజెండా కావాలో, నేరస్తులను కాపాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారు కావాలో తేల్చుకోవాలన్నారు. ‘నన్ను ప్రధానిని చేసింది యూపీనే.. ఇందుకు రుణం తీర్చుకుంటా.. ప్రస్తుతమిక్కడి ప్రగతి నిరోధక ప్రభుత్వంలా కాకుండా కేంద్రంతో కలసి పనిచేసే ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది’ అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరగతి రైతుల రుణాలను మాఫీ చేస్తామని, చెరకు రైతులకు 14 రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తామన్నారు. ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుపై.. మొన్నటివరకు పరస్పరం తిట్టుకున్న ఎస్పీ, కాంగ్రెస్‌లు రాత్రికి రాత్రి పొత్తుపెట్టుకున్నాయని మోదీ ధ్వజమెత్తారు. తమను తాము కాపాడుకోలేని వారు యూపీని కాపాడలేరని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి దగ్గర రూ. 150 కోట్లు దొరికినా, అతనిపై చర్య తీసుకోలేదని మండిపడ్డారు. తన కుటుంబానికి, తనకు ప్రాధాన్యమిచ్చిన అఖిలేశ్ ఇప్పుడు అధికారంకోసం పరితపిస్తున్నారని విమర్శించారు. బాబాయి, అబ్బాయి, నాన్న, దాయాది వ్యవహారాలతో ప్రభుత్వం తీరికలేకుండా ఉందని, జనం తమ ఓట్లతో ‘స్కాం’ పార్టీలను నిర్మూలిస్తేనే మార్పు వస్తుందని ములాయం కుటుంబ గొడవలను ప్రస్తావిస్తూ అన్నారు. వనరులు ఉన్న యూపీ.. ప్రభుత్వాల నిర్వాకం వల్ల పేదరికం, నిరుద్యోగం నుంచి బయటికిరావడం లేదని, కేంద్రనిధులను అఖిలేశ్ సర్కారు సద్వినియోగం చేయడంలేదన్నారు. -
కేసీఆర్ కుటుంబం తప్ప నగరం అభివృద్ది చెందలేదు
అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చైతన్యపురి: టీఆర్ఎస్ ఏర్పడ్డ 18నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అభివృద్ది చెందింది తప్ప నగర అభివృద్ది జరగలేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. చైతన్యపురి బీజేపి అభ్యర్ధి రంగానర్సింహగుప్త ప్రచారంలో బాగంగా గురువారం డివిజన్లోని భవానినగర్, చైతన్యపురి, బాబుకాంప్లెక్స్, ప్రభాత్‌నగర్, సాయినగర్‌లలో జరిగిన రోడ్‌షోలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓల్డ్ సిటీని ఒవైసి సోదరులు, న్యూసిటీని అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవితలు ఇదినాకు అది మీకు అని పంచుకుంటున్నారని విమర్శించారు. రెండు కుంటుంబాల మద్య నగరాన్ని నలిగిపోనివ్వమని పేర్కొన్నారు. హైదరాబాద్ భవిష్యత్తు, రక్షణకు సంబందించి గ్రేటర్ ఎన్నికలు కీలకమైనవని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో రోడ్ల గుంతలు పూడ్చిందా, కాలుష్యాన్ని తగ్గించిందా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి సహకారం లేకుండా నగరాన్ని కేసీఆర్ అభివృద్ది చేయగలరా అన్నారు. బీజేపి లేని నగరాన్ని ఊహించుకోలేమని, బాంబుపేలుళ్ల సమయంలో నగర ప్రజలకు బీజేపి అండగా ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల, ప్రాంతాల, అన్నివర్గాల ప్రజలు నివసిస్తున్నారని నగరం మజ్లీస్, టీఆర్ఎస్లది కాదని అన్నారు. బీజేపి అభ్యర్ధులను గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచి అయినా డివిజన్ల అభివృద్ది చేస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రంగా నర్సింహగుప్తను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బద్దం సుభాష్‌రెడ్డి, నాయకులు శంకర్‌రెడ్డి, హరిబాబు, రుద్రారపు శంకర్, వినోద్‌యాదవ్, శివ, శివవోజా, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం సోదర పార్టీలు.... హయత్‌నగర్: టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సోదర పార్టీలని నగరంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాలంటే మిత్ర పక్షాలైన బీజేపి టీడీపి అభ్యర్ధులను గెలిపించాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా హయత్‌నగర్ డివిజన్ బీజేపి అభ్యర్ధి కళ్లెం రవీందర్‌రెడ్డికి మద్దతుగా ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని ఎంతో మంది త్యాగం చేస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. నగర ప్రజలకు బీజేపి అండగా ఉంటుందన్నారు. ప్రజల బతుకులు దుర్బరంగా మారాయని వారి బతుకుల్లో వెలుగులు నింపాలంటే బీజేపి గెలవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నక్కరవీంర్గౌడ్, నాయకులు బోడ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు మాకున్నది ఇద్దరు ఎమ్మెల్యేలేనా...!
గత ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే బీజేపీ అయిదు సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న అయిదుగురు ఎమ్మెల్యేల్లో పార్టీకి అసలు ఎంత మంది పనికొస్తారనే చర్చ కమలనాథుల్లో సాగుతోందట. ఉండడానికి సంఖ్య అయిదయినా, వాస్తవానికి పనికొచ్చేది, జీహేచ్ఎంసీ ఎన్నికల్లో కాస్తాకూస్తో బలాన్ని ప్రదర్శించగలిగేది ఇద్దరు మాత్రమేనని బీజేపీ నాయకులు నిట్టూర్పులు విడుస్తున్నారట. అదేంటీ అయిదుగురు ఎమ్మెల్యేలుండి ఇద్దరే పనికొస్తారంటే ఎలా అని దీనిపై కొందరు అంతర్గతచర్చల్లో ఆరా తీశారట. ఒక ఎమ్మెల్యే బీఫ్ వ్యవహారంలో పార్టీ నాయకత్వంపైనే బహిరంగంగా ఆరోపణలు చేసి ఏకంగా శివసేన పార్టీకి దగ్గరవుతున్నట్లు, ఇంకొక ఎమ్మెల్యే సాధు రాజకీయాల్లో తలమునకలై పోయారని, మరో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని పారిశ్రామికప్రాంతంలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకులే గుసగుసలు పోతున్నారట. గ్రేటర్ ఎన్నికల్లో వీరి సహకారం, అభ్యర్థులను గెలిపించుకోవడంలో పార్టీకి, టీడీ పీ-బీజేపీ కూటమికి ఏ మేరకు ఉపయోగపడతారన్నది అనుమానమేనని అంటున్నారు. అదీగాకుండా ఏవో కారణాలతో ఒకరిద్దరు అధికారపార్టీకి కొంత అనుకూలంగా కూడా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని చెవులు కొరుక్కుంటున్నారట. బీజేపీ నాయకుల పరిస్థితి ఈ విధంగా ఉండగా ఆ పార్టీతో పొత్తులో భాగంగా కలసి పోటీచేయాలనుకుంటున్న టీడీపీ నాయకులు కూడా కొందరు బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారట. ఈ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థులు, ముఖ్యంగా మేయర్ అభ్యర్థి పోటీచేయడానికి జంకుతున్నట్లు స్వయంగా టీడీపీ నాయకులే వెల్లడిస్తున్నారట. చివరకు ఎటుపోయి ఎటు వస్తుందో, బీజేపీతో పొత్తుతో ఏమి జరుగుతుందోనన్న టెన్షన్లో ‘దేశం’ నాయకులు కిందా మీదా పడుతున్నారట... -
పుష్కర అవినీతిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తా
పుష్కరాల సమయంలో నగర సుందరీకరణలో, భోజనాల బిల్లుల విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఈ విషయం గురించి లోకాయుక్త, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ సమావేవంలో చర్చించి బిల్లులను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు తెలిపినా సరిగా స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఇంచార్జి కమిషనర్ సకలారెడ్డి ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. -
ప్రత్యేక హోదాపై మాట మార్చిన బీజేపీ
కడప సెవెన్‌రోడ్స్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న విషయం విభజన బిల్లులోనే స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. కాగా బీజేపీ నేత వెంకయ్యనాయుడు విభజన చట్టంలో లేదని చెప్పడం శుద్ద అపబ్దమని దుయ్యబట్టారు. నాటి యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు ఐదేళ్లపాటు స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇస్తామని ప్రకటించగా, దాన్ని పదేళ్లకు పెంచాలంటూ ఆనాడు మాట్లాడిన వెంకయ్యనాయుడు నేడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రానిపక్షంలో ఎన్డీయే నుంచి చంద్రబాబు తక్షణమే బయటికి రావాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ సీపీఎం మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా మాట్లాడాయన్నారు. విభజన సందర్బంగా ఆంధ్ర రాష్ట్రానికి నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశ్యంతో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారన్నారు. బహుళ ప్రయోజనాలతో సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువజేసే హామిలతో చట్టబద్దమైన భరోసా ఇచ్చారన్నారు. కేంద్రంలో ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదన్న ఉద్దేశ్యంతో 2014 మార్చి 1వ తేది కేంద్ర మంత్రివర్గం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించి ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు పంపిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదాకు అప్పట్లో పట్టుబట్టిన వెంకయ్యనాయుడు నేడు ఇతర రాష్ట్రాలు కూడా అంగీకరించాల్సి ఉంటుందని చెప్పడం ఆయన రెండు నాల్కల ధోరణిని వెల్లడిస్తోందని తూర్పారబట్టారు. ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తర కోస్తాలకు ప్రత్యేక ప్యాకేజీని సాధించలేని చంద్రబాబు సిగ్గూఎగ్గు లేక ఎన్డీయేలో కొనసాగుతున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్ నబీరసూల్, కాంగ్రెస్ నాయకులు సత్తార్, గొర్రె శ్రీనివాసులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బండి జకరయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
శివసేనకు 12 మంత్రి పదవులు?
‘మహా’ సర్కారులో చేరికకు సిద్ధం ముంబై: మహారాష్ట్రలోని బీజేపీ సర్కారులో శివసేన చేరేందుకు రంగం సిద్ధమైంది. శివసేనకు 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు తెలిసింది. ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకోవటంపై శివసేనతో చర్చలు 70 నుంచి 80 శాతం పూర్తయినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం ప్రకటించటం తెలిసిందే. విబేధాలను పక్కనపెట్టి కలసి పనిచేసేలా ఆమోద యోగ్యమైన ప్రతిపాదనలకు రెండు పార్టీలూ అంగీకరించినట్లు శివసేన సీనియర్ నేత ఒకరు మంగళవారం తెలిపారు. దీని ప్రకారం ఫడ్నవిస్ సర్కారులో శివసేనకు 5 క్యాబినెట్ హోదా పదవులతో కలిపి మొత్తం 12 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ తమకు ఇవ్వాలన్న డిమాండ్‌పై శివసేన బెట్టు సడలించింది. శివసేనకు పరిశ్రమలు, పర్యావరణం, ఆరోగ్యం, రవాణా/ఎక్సైజ్ తదితర శాఖలను కేటాయించే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలే మృతితో బుధవారం జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం కొద్ది రోజులు వాయిదా పడనుందని శివసేన సీనియర్ నేత ఒకరు తెలిపారు. -
తెరపైకి మళ్లీ ‘ఆర్టికల్ 370’!
జమ్మూకశ్మీర్‌కు తాత్కాలిక స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే అధికరణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనిపై పార్టీల మాటల యుద్ధం గెలుపే లక్ష్యంగా ‘370’పై బీజేపీ మాట మారుస్తోందన్న కాంగ్రెస్ నేషనల్ డెస్క్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘ఆర్టికల్ 370’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌కు తాత్కాలిక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆ ఆర్టికల్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. రామజన్మభూమి, ఉమ్మడి పౌర స్మృతితో పాటు ఈ అంశాన్నీ తమ ఎజెండాలో భాగం చేసుకుంది. 2009 పార్టీ మేనిఫెస్టోలోనూ ఆ అంశాన్ని చేర్చింది. కానీ 2014 వచ్చేసరికి.. జమ్మూలో 2013, డిసెంబర్లో ఒక సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 పై చర్చ జరగాల్సి ఉందని, దానివల్ల జమ్మూకశ్మీర్‌కు ఏమైనా ప్రయోజనాలు లభించాయా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే, కశ్మీర్ ఎన్నికల సమయంలో ఆ అంశాన్ని లేవనెత్తవద్దంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 19న వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 విషయంలో బీజేపీ వైఖరిలో వచ్చిన ఈ మార్పును అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్.. జమ్మూకశ్మీర్‌లో అధికారం కోసం బీజేపీ మాట మార్చిందని విమర్శిస్తోంది. ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడం బీజేపీకి అలవాటేనని దుయ్యబడ్తోంది. తమ వైఖరిలో మార్పేం లేదని, ఆర్టికల్ 370పై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని, కాకపోతే ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం ఆర్టికల్ 370 అంశాన్ని వాడుకోవద్దనే ఉద్దేశంతోనే.. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తొద్దని అంటున్నామని బీజేపీ వాదిస్తోంది. ఆర్టికల్ 370 విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టతనివ్వాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కనీసం 44 స్థానాలు సాధించి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఆ వ్యూహంలో భాగంగానే ఆర్టికల్ 370పై మెతక వైఖరి అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 పూర్వాపరాలు, ముఖ్యాంశాలు.. 1947లో జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ నాయకుడైన షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ 370ని రూపొందించారు. అయితే, దీనికి తాత్కాలిక స్థాయి కాకుండా శాశ్వత స్థాయి కావాలని అబ్దుల్లా చేసిన డిమాండ్‌కు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంగీకరించలేదు. ఈ అధికరణను రూపొందించేందుకు రాజ్యాంగ ప్రధాన రూపకర్త అయిన డాక్టర్ అంబేద్కర్ అంగీకరించలేదు. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ‘తాత్కాలిక’ స్వతంత్ర ప్రతపత్తిని కల్పించింది. రాజ్యాంగంలో ప్రత్యేక, తాత్కాలిక నిబంధనలను పొందుపర్చిన 21వ భాగంలో దీన్ని చేర్చారు. క్రమంగా తొలగించాలనే ఉద్దేశంతోనే దీనికి తాత్కాలిక స్థాయి కల్పించారు. ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు,ఆర్థిక, సమాచార రంగాల్లో మినహా మరే ఇతర అంశాల్లోనైనా చట్టాలను ఈ రాష్ట్రంలో అమలు పర్చేందుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, ఆస్తుల సముపార్జన.. ఈ అంశాల్లో మిగతా దేశంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలున్నాయి. మిగతా రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఆస్తులు కొనుక్కోవడాన్ని అనుమతించరు. రాష్ట్ర సరిహద్దులను పార్లమెంటు మార్చలేదు. ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించడానికి వీలు కలిగించే ఆర్టికల్ 360ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉపయోగించలేదు. ఎమర్జెన్సీని కూడా యుద్ధ సమయాల్లో, విదేశీ ఆక్రమణల సమయాల్లో మాత్రమే ప్రకటించాలి. అంటే అంతర్గత అశాంతి తదితర కారణాలతో ఎమర్జెన్సీ ప్రకటించాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు ఈ రాష్ట్ర ప్రజలకు వర్తించవు. రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన విద్యాహక్కును కూడా ఇక్కడ అమలు చేయడం సాధ్యం కాదు. 1965 వరకు జమ్మూకశ్మీర్‌కు గవర్నర్ స్థానంలో ‘సదర్ ఇ రియాసత్’, ముఖ్యమంత్రి స్థానంలో ‘ప్రధానమంత్రి’ ఉండేవారు. జనాభా పరంగా జమ్మూలో హిందువులు, కశ్మీర్ లోయలో ముస్లింలు, లడఖ్ ప్రాంతంలో ముస్లింలు, బౌద్ధ మతస్తులు అధికంగా ఉన్నారు. -
ఢిల్లీలో మళ్లీ ఎన్నికల భేరి..!
-
ప్రపంచ బ్యాంక్ నిధులతో రహదారుల అభివృద్ధి
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప శివమొగ్గ : శివమొగ్గ-హానగల్, శికారిపుర-ఆనందపురం మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను రూ.425 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో అభివృద్ధి చేయడానికి ఆమోదం లభించినట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆదివారం శివమొగ్గలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివమొగ్గ నగర, గ్రామీణ, హొన్నాళి, శికారిపుర, సాగర, సొరబ, హనగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, శివమొగ్గ, దావణగెరె, హవేరి లోకసభ నియోకవర్గ పరిధిలోని రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా నివేదికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరణకు అవసరమైన భూస్వాధీన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నిధుల కోసం ప్రపంచ బ్యాంక్‌కు నివేదిక సమర్పించడం జరిగిందని చెప్పారు. ఇటీవలె ఈ పనులకు ప్రపంచబ్యాంక్ ఆమోదం లభించిందని, రెండు ప్యాకేజీల్లో నిధులు విడుదల చేసేందుకు బ్యాంక్ అంగీకరించిందని తెలిపారు. వారంలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మూడు నెలల్లోపు పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని అన్నారు. బైందూరు, హొసనగర, బట్టేమల్లప్ప, ఆనందపుర, శికారిపుర, మాసూరు రోడ్డు, శిరసి, బనవాసి, శిరాళకొప్ప, హొన్నాళి, హరిహర రోడ్డు, శివమొగ్గ, హనగల్ రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. -
బాబు, మంత్రులకు అవగాహన లేదు
మోడిని రాక్షసుడన్న బాబు పదవి కోసమే పొత్తు ముస్లింలకు మోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం పుంగనూరు: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఆయన మంత్రివర్గ సభ్యులకు అవగాహన లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని, మోడి రాక్షసుడని, గుజరాత్ అల్లర్లకు మోడి కారకుడని ఎద్దేవా చేసిన చంద్రబాబు చివరకు పదవి కోసం బీజేపీతో పెట్టుకున్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ఎవరికైనా పదవులు ఇచ్చారా..? డబ్బు న్న వారికి ఎమ్మెల్సీలుగా గుర్తించి మంత్రులను చేసిన చంద్రబాబుకు ముస్లిం మైనార్టీలు కన్పించలేదా’’ అంటూ పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. శుక్రవారం రాత్రి పుంగనూరు అంజుమన్ షాదిమహాల్‌లో ముస్లిం నేతలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానిం చారు. ముస్లింలను ఉద్దేశించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నిక ల సమయంలో చంద్రబాబు నాయు డు రుణమాఫీ చే స్తామని చెప్పి, పదవి రాగానే మాట మార్చుతూ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రుణమాఫీ ని పక్కన పెట్టి, రుణాలను రీషెడ్యూల్ చేస్తామని, వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమన్నా రు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తం భించిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కి, మంత్రుల మాటలకు పొంతనలేదన్నారు. మంత్రులు, చంద్రబాబు అవగాహన లేకుండా ఇష్టానుసారం మా ట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎర్రచందనం 5 వేల టన్ను లు ఉందని, దానిని విక్రయిస్తామని ఆ మంత్రి చెబుతుంటే, ముఖ్యమంత్రి 15 వేల టన్నులు ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎంత ఎర్రచందనం సీజ్ చేశారో తెలియని మంత్రివర్గం పరిపాలన ఎలా చేస్తారని నిలదీశారు. రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు ప్రజలను మోసగించారని దుయ్యబ ట్టారు. రెండు మూడు నెలల్లో రుణమాఫీలపై రైతులు, మహిళలు తిరగబడి ఉద్యమం నిర్వహిస్తారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఇప్పటికైనా సమస్యను గుర్తించి, రుణమాఫీ చేసి రైతులను, మహిళలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు చోటు కల్పించకపోవడం వారిని అవమానిం చినట్లేనని అన్నారు. భవిష్యత్తులో ముస్లిం సోదరులు ఇలాంటి విషయాలను గుర్తించుకుని తగిన గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు రెడ్డెప్ప, కొండవీ టి నాగభూషణం, వెంకటరెడ్డి యాద వ్, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, ఆవుల అమరేంద్ర, క్రిష్ణారెడ్డి, త్యాగరా జు, ఖాదర్‌బాషా, ఇనాయతుల్లా షరీ ఫ్, ఫకృద్ధిన్ షరీఫ్, కెఎస్‌ఏ.ఇఫ్తికార్ అలీఅహమ్మద్, అమ్ము, ఇబ్రహిం తది తరులు పాల్గొన్నారు. -
నేడు ‘చిన్నమ్మ’ పర్యటన
జిల్లాలో మూడో దశ ప్రచారం నాలుగు నియోజకవర్గాల పరిధిలో సభలు స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, జనగామలో ఏర్పాట్లు పూర్తి వరంగల్, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు జిల్లాలో ఆరుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ దఫా నాలుగు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.00 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో, 2-40 గంటలకు పరకాలలో, 3-20 గంటలకు నర్సంపేట లో, 5-30 గంటలకు జనగామలో జరిగే సభల్లో పాల్గొంటారు. నర్సంపేట సభ అనంతరం సిరిసిల్లలో సభకు హాజరై జనగామలో ఏర్పాటు చేసిన సభకు వస్తారని సమాచారం. తొలి సారి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఈ దఫా జిల్లాలో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేసీఆర్ స్వయంగా సభల్లో పాల్గొంటున్నందున గులాబీ శ్రేణులు, అభ్యర్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థులు జనసమీకరణకు సర్వశక్తులొడ్డుతున్నారు. ఎన్నికల ప్రచార సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు కోరారు. -
అయోమయం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రధాన పార్టీల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి నేటి (సోమవారం)తో సహా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఇప్పటికీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే విషయం అటు రాష్ట్ర నాయకులకే అంతుబట్టడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఎవరికి అనుకూలంగా ప్రచారంలో చేయాలో కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే జేడీఎస్ పార్టీ తమ కార్యకర్తలను ఎక్కువ అయోమయంలో పడేస్తోంది. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాలకూ కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా సగానికి సగం మంది చేత నామినేషన్లు వేయించారు. ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశాయి. అయితే జేడీఎస్ మాత్రం ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనేలేదు. ఇప్పటి వరకూ జేడీఎస్ కోసం పనిచేసిన వారికి కాదని ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దావణగెరెకు కాంగ్రెస్ నుంచి టికెట్టు ఆశించి భంగపడిన మహిమా పాటిల్‌ను అదేస్థానంలో జేడీఎస్ తరఫున పోటీ చేయించనున్నామని జేడీఎస్ నాయకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఆ స్థానంపై కన్నేసిన ఓ మైనారిటీ జేడీఎస్ నేత అనుచరులు ఏమి చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ బెంగళూరు సెంట్రల్ నుంచి జేడీఎస్ తరఫున బరిలో దిగనున్నట్లు పార్టీ నాయకులు ఘంటాపథంగా చెబుతుండగా షరీఫ్ కాంగ్రెస్‌ను వీడబోరని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఒక వ్యక్తి గురించి రెండు పార్టీల అధినాయకులు పరస్పర విరుద్ధంగా చెప్పుతుండటం ఇరు పార్టీల కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. చిక్కబళాపుర నుంచి కుమారస్వామి పోటీచేసే విషయంపై ఆయనతోపాటు ఆయన తండ్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ కూడా ఇప్పటికీ ఓ అవగాహనకు రాలేకపోవడం పట్ల ఆ ప్రాంత జేడీఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పార్టీల్లోనూ అంతే.. టికెట్ల కేటాయింపులో అటు బీజేపీలోనూ ఇటు కాంగ్రెస్‌లోనూ అసమ్మతి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. బీదర్ పార్లమెంటు టికెట్టును బీజేపీ ఖూబాకు ఇచ్చింది. కేజేపీ వదలి మొదటి నుంచి ఆ టికెట్టుపై కన్నేసిన సూర్యకాంత్ నాగమారపల్లి ఇప్పటికీ తానే నామినేషన్ దాఖలు చేస్తానని ఇందుకు యడ్యూరప్ప సాయం చేస్తారని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో అక్కడి బీజేపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ముఖ్యంగా మండ్య టికెట్టు దక్కించుకున్న రమ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంబరీష్ అనుచరులను చులకన భావనతో చూస్తున్నారని అందువల్ల ఆమెను పోటీ నుంచి తప్పించనున్నారని కేపీసీసీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై రమ్యతో మాట్లాడి ఒప్పించడానికే ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ ఆమెకు సూచించారని ఆ వర్గం చెబుతోంది. అలాంటిది ఏమీ లేదని ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడటానికేనని మరో వర్గం చెబుతోంది. శివమొగ్గ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించి భంగపడిన కుమార బంగారప్ప ఈనెల 26లోపు తనకు టికెట్టు ఇవ్వక పోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే అలాంటిది ఏమీ జరగదని ముఖ్యమంత్రి చెబుతుండటంతో అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు కుమార బంగారప్ప అనుచరులు కూడా అయోమయంలో పడ్డారు. ఇలా కేపీసీసీ నాయకులే విభిన్న ప్రచారం చేస్తుండటంతో క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. నామినేషన్లు వేయడానికి పట్టుమని మూడురోజులే ఉన్న సమయంలో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల విషయంలో ఇంత గందరగోళం ఉండటం వారి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.