బాబు, మంత్రులకు అవగాహన లేదు
- మోడిని రాక్షసుడన్న బాబు
- పదవి కోసమే పొత్తు
- ముస్లింలకు మోసం
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
పుంగనూరు: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఆయన మంత్రివర్గ సభ్యులకు అవగాహన లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని, మోడి రాక్షసుడని, గుజరాత్ అల్లర్లకు మోడి కారకుడని ఎద్దేవా చేసిన చంద్రబాబు చివరకు పదవి కోసం బీజేపీతో పెట్టుకున్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ఎవరికైనా పదవులు ఇచ్చారా..? డబ్బు న్న వారికి ఎమ్మెల్సీలుగా గుర్తించి మంత్రులను చేసిన చంద్రబాబుకు ముస్లిం మైనార్టీలు కన్పించలేదా’’ అంటూ పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
శుక్రవారం రాత్రి పుంగనూరు అంజుమన్ షాదిమహాల్‌లో ముస్లిం నేతలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానిం చారు. ముస్లింలను ఉద్దేశించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నిక ల సమయంలో చంద్రబాబు నాయు డు రుణమాఫీ చే స్తామని చెప్పి, పదవి రాగానే మాట మార్చుతూ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రుణమాఫీ ని పక్కన పెట్టి, రుణాలను రీషెడ్యూల్ చేస్తామని, వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమన్నా రు.
రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తం భించిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కి, మంత్రుల మాటలకు పొంతనలేదన్నారు. మంత్రులు, చంద్రబాబు అవగాహన లేకుండా ఇష్టానుసారం మా ట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎర్రచందనం 5 వేల టన్ను లు ఉందని, దానిని విక్రయిస్తామని ఆ మంత్రి చెబుతుంటే, ముఖ్యమంత్రి 15 వేల టన్నులు ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎంత ఎర్రచందనం సీజ్ చేశారో తెలియని మంత్రివర్గం పరిపాలన ఎలా చేస్తారని నిలదీశారు.
రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు ప్రజలను మోసగించారని దుయ్యబ ట్టారు. రెండు మూడు నెలల్లో రుణమాఫీలపై రైతులు, మహిళలు తిరగబడి ఉద్యమం నిర్వహిస్తారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఇప్పటికైనా సమస్యను గుర్తించి, రుణమాఫీ చేసి రైతులను, మహిళలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు చోటు కల్పించకపోవడం వారిని అవమానిం చినట్లేనని అన్నారు.
భవిష్యత్తులో ముస్లిం సోదరులు ఇలాంటి విషయాలను గుర్తించుకుని తగిన గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు రెడ్డెప్ప, కొండవీ టి నాగభూషణం, వెంకటరెడ్డి యాద వ్, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, ఆవుల అమరేంద్ర, క్రిష్ణారెడ్డి, త్యాగరా జు, ఖాదర్‌బాషా, ఇనాయతుల్లా షరీ ఫ్, ఫకృద్ధిన్ షరీఫ్, కెఎస్‌ఏ.ఇఫ్తికార్ అలీఅహమ్మద్, అమ్ము, ఇబ్రహిం తది తరులు పాల్గొన్నారు.