నివృత్త లోకాయుక్త భాస్కర్‌రావ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హోంశాఖ అన్ని ...
బెంగళూరు: నివృత్త లోకాయుక్త భాస్కర్‌రావ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హోంశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. భాస్కర్‌రావ్ కుమారుడైన అశ్విన్‌రావ్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లోకాయుక్త జాయింట్ కమిషనర్ రియాజ్ సహకారంతో అక్రమాలకు పాల్పడిన కేసులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్‌ఐటీ) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి భాస్కర్‌రావ్ నుంచి కొంత సమాచారం తీసుకున్నా అయన్ను నిందితుడి స్థానంలో ఉంచి విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం.
ఈ నేపథ్యంలో పరిస్థితని వివరిస్తూ సీఐటీ ప్రభుత్వానికి లేఖ రాసింది. సదరు లేఖ ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరడంతో గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా భాస్కర్‌రావ్‌ను విచారించడానికి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అనుమతించినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకూ సాక్షి స్థానంలో ఉన్న భాస్కర్‌రావ్‌ను సీఐటీ సంస్థ విచారించి అటు పై అరెస్టు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇంజనీర్ కృష్ణమూర్తిని డబ్బులు డిమాండ్ చేసిన కేసులో భాస్కర్‌రావ్‌కు సంబంధం ఉందని తేలడంతో ఆయన్ను అరెస్టు చేయడానికి ఎస్‌ఐటీ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.