సీపీఎం నేత బాబూరావు ఆరోపణ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ బల్బులు అమర్చే బాధ్యతను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌కు కట్టబెడుతూ ప్రభుత్వం జీవో- 74ను జారీ చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ఆరోపించారు. విజయవాడలో గురువారం ఆయన మాట్లాడుతూ ఒక కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా సబ్ కాంట్రాక్టులు తీసుకుని అప్పనంగా స్థానిక సంస్థల నిధులు భోంచేసే వ్యూహం పన్నారని ఆరోపించారు.
వాస్తవానికి ఎల్‌ఈడీ బల్బు 20వాట్స్ ఒక్కొక్కటి రూ.3,100 ఉంటే దాన్ని రూ.6,330 చొప్పున కాంట్రాక్టులో పేర్కొన్నారని, కృష్ణా జిల్లాలో మిక్ కంపెనీకి సబ్ కాం ట్రాక్టు ఇవ్వడం వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్నారు. కేవలం రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి కార్పొరేషన్ నుంచి రూ.40 కోట్లకుపైగా రాబడిని దండుకునేలా కుట్ర ఉం దని ఆరోపించారు. అన్ని మున్సిపాలిటీలూ ప్రభుత్వం సూచించిన సంస్థతో ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టు కుదుర్చుకోవాలని మంత్రి నారాయణ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
ఎల్‌ఈడీ బల్బుల వ్యవహారంలో భారీ కుంభకోణం
Published Fri, Jul 31 2015 1:30 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement