కంటిచూపు కోసం వెళ్లి కన్నుమూశాడు
ఏలూరు సిటీ : కంటి చూపు బాగవుతుందని ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన డి.సుబ్బాచారి (55) కంటి శుక్లాల శస్త్రచికిత్స కోసం ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఏఏ కంటి ఆసుపత్రికి సోమవారం వచ్చాడు. అతనిని ఆపరేష¯ŒS థియేటర్‌లోకి తీసుకువెళ్లిన వైద్యులు 15 నిమిషాలకే అతను చనిపోయాడంటూ బయటకు తీసుకువచ్చారు. సుబ్బాచారి చనిపోయిన విషయాన్ని తెలసుకున్న ఏలూరులో పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న అతని కుమారులు డి.విజయరాజు, రాజేంద్రప్రసాద్, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే సుబ్బాచారి మృతికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో టూటౌ¯ŒS సీఐ బంగార్రాజు, నగర సీఐ ఎ¯ŒS.రాజశేఖర్, ఎస్సైలు దుర్గారావు, గంగాధర్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. సుబ్బాచారి కుమారులు మాట్లాడుతూ తమకే ఇలా వైద్యం చేస్తుంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ వైద్యులను నిలదీశారు. నిర్లక్ష్యంతో తమ తండ్రి ప్రాణాలతో చెలగాటమాడిన వైద్యులపై స్థానిక టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన టూటౌ¯ŒS సీఐ యు.బంగార్రాజు దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్షపడేలా చేస్తామని సుబ్బాచారి బంధువులకు హామీ ఇచ్చారు.