నమోమంత్రం.. నామమాత్రం | Narendra modi has known Voters Pulse | Sakshi
Sakshi News home page

నమోమంత్రం.. నామమాత్రం

Published Tue, Apr 8 2014 2:24 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

నమోమంత్రం.. నామమాత్రం - Sakshi

నమోమంత్రం.. నామమాత్రం

* ‘మోడీ ప్రభంజనం’లో నిజం నేతి బీరే!
* ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసిన కర్ణాటకలో పరాజయం
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం
* స్థానిక పరిస్థితుల వల్లే మధ్యప్రదేశ్, రాజస్థాన్ విజయాలు
* సభలకు వస్తున జనాన్ని ‘మోడీ గాలి’గా చూడటం పొరపాటు
* కాంగ్రెస్‌కు స్వీయ తప్పిదాల వల్లే భారీగా సీట్లు తగ్గుతాయి
* వాటిలో కొన్ని బీజేపీకి, కొన్ని ప్రాంతీయ పార్టీలకు పోవచ్చు

 
 ప్రధానాంశాలపై ఓటర్లను ఏదైనా రాజకీయు పార్టీ తనవైపు తిప్పుకోగలిగి, ఎన్నికల్లో చె ప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సంపాదిస్తే దాన్ని ‘ప్రభంజనం’గా వర్ణిస్తారు. సాధారణంగా ఎన్నికల్లో ప్రభంజనాలు జనంలో వ్యతిరేకత వల్ల వీస్తారుు. భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ప్రభంజనాలు క్రవుం తప్పకుండా వచ్చేవి కాదని లోక్‌సభ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే అర్థవతుంది. అరుుతే 1977, 1984 లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద గాలులే వీచారుు. కాంగ్రెస్ విధించిన జాతీయ ఎమర్జెన్సీపై జనం 1977లో తవు ఆగ్రహాన్ని వెల్లగక్కారు. దాంతో కాంగ్రెస్‌ను జనతా పార్టీ ఓడించడమే గాక మొత్తం 543 సీట్లకుగాను 295 సీట్లను కైవసం చేసుకోగలిగింది. అయితే దేశవ్యాప్తంగా ఒక పార్టీకి అనుకూలంగా అతి పెద్ద ప్రభంజనం దూసుకొచ్చింది మాత్రం 1984 ఎన్నికల్లోనే. అప్పటి ప్రధాని ఇందిర హత్యతో పుట్టిన  బలమైన సానుభూతి పవనాల సాయంతో కాంగ్రెస్ ఘనవిజయుం సాధించింది. ఎప్పుడూ లేని స్థాయిలో ఏకంగా 404 సీట్లు గెలుచుకుంది. ఇలా కాలవూన పరిస్థితులు, కారణాల వల్ల ఓ పార్టీకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో జనం ఓట్లేయుడాన్ని ఎన్నికల్లో ప్రభంజనాలుగా చెబుతున్నారు.
 
 బీజేపీ అనుకూల ప్రభంజనాలు

 1996, 98, 99 ఎన్నికల్లో వాజ్‌పేరుు నాయుకత్వంలో బీజేపీకి అనుకూల గాలులు వీచాయుని ఆ పార్టీ ఎన్నికల చరిత్ర వెల్లడిస్తోంది. దాదాపు 26 శాతం ఓట్లతో 182 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకోగలిగింది. లోక్‌సభలో మెజారిటీకి చాలా దూరంగా ఉన్నా అతి పెద్ద పార్టీగా అయితే అవతరించగలిగింది. అరుుతే 2014 లోక్‌సభ ఎన్నికల వుుంగిట ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న దృశ్యం వూత్రం ఎన్నికల ప్రభంజనాలు అనే వూటకు కొత్త కోణాన్ని జత చేసింది. రాజకీయు విశ్లేషకులు, మీడియూ నిపుణుల వూటలను నిజవుని నమ్మితే గనుక- ఈసారి  పరిస్థితులు ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నాయనుకోవాలే తప్ప బీజేపీకి కాదు. అంటే ఇది ఓ వ్యక్తికి అనుకూల ప్రభంజనమేగాని, ఓ రాజకీయు పార్టీకి కాదన్నమాట.
 
 బీజేపీని గెలిపించని మోడీ ప్రచారం
 మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ రాష్ట్రాల్లో ఆయున జరిపిన ప్రచారాన్ని సమీక్షిస్తే ఆయునకున్న జనాదరణ ఏమిటో అర్థవతుంది. ఆయనను ప్రధాని అభ్యర్థిని చేశాక ఎన్నికలు జరిగిన తొలి రాష్ట్రం కర్ణాటక. అక్కడ మోడీ ప్రచారం కూడా బీజేపీ పరాజయూన్ని తప్పించలేకపోయింది. వుధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయూనికి అక్కడ బలంగా వీచిన మోడీ ప్రభంజనమే కారణమనడం.. వాస్తవానికి కాస్త దూరమే. ఎందుకంటే వుధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ సుపరిపాలన పార్టీని గెలిపించింది. అలాగే రాజస్థాన్‌లో పాలకపక్షమైన కాంగ్రెస్‌పై జనం అసంతృప్తిని వసుంధరా రాజే బీజేపీకి అనుకూలంగా వూర్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోడీ ర్యాలీలు గానీ, ఆయున జనాకర్షక వుంత్రాలు గానీ పని చేయులేదు. ఫలితంగా కాంగ్రెస్ ఓట్లు చాలావరకు ఆప్‌కు బదిలీ అవడమే గాక బీజేపీ ఓట్లు కూడా 2 శాతం దాకా ఆప్ ఖాతాలో చేరారుు. ఇదే ధోరణి కొనసాగితే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోల్పోయే ఓట్లు ఆప్‌కే పడతారుు. అదే జరిగితే ప్రధాని కావాలన్న మోడీ కోర్కె తీరకుండా ఆప్ అడ్డుకునే ప్రవూదముంది. ఇక... మోడీకి అనుకూల ప్రభంజనం వల్లే ఆయున సభలకు జనం భారీగా హాజరౌతున్నారని కూడా భాష్యం చెబుతున్నారు. కానీ ఆయున ర్యాలీలకు, సభలకు ప్రజలను భారీగా సమీకరించడానికి బీజేపీ భారీగా డబ్బును, వనరులను వెచ్చిస్తోందని ఆరోపణలొచ్చారుు. కాబట్టి మోడీ సభలకు వచ్చే జనాన్ని బట్టి అదంతా మోడీ గాలేనని చెప్పడం సరికాదు.
 
మోడీ గాలి వాస్తవదూరం
 సగటు వునిషిని వేధిస్తున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ వుందగవునం వల్ల యుూపీఏ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఆర్థిక వూం ద్యం ప్రభావం అన్ని వర్గాలపై పడుతోంది. ఇది ఎన్నికల ఫలితాలను తప్పక ప్రభావితం చేస్తుంది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు కోల్పోతుంది. అవి కొన్ని బీజేపీ ఖాతాలో, వురికొన్ని ప్రాంతీయు పారీల్ట బుట్టల్లో పడతారుు.
 
 ఈ అంశాలన్నీ పరిశీలించాక... మోడీ ప్రభంజ నం అనేది వాస్తవ దూరవునీ, మీడియూలోని ఆయున వుద్దతుదారులు,  ఆయున ప్రచార విభాగం, ఆయున ప్రధాని కావడానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా వుద్దతిచ్చే మేధావులు కష్టపడి సృష్టిస్తున్న ఎండవూవేనని చెప్పవచ్చు. బీజేపీ సొంతగా మెజారిటీ సీట్లు సాధిస్తే 2014 ఎన్నికలను ఒక పార్టీకి అనుకూలంగా నడిచిన ‘వేవ్’గా వర్ణించవచ్చు. లేకుంటే ఎన్నికల్లో ఓట్లు పొందడానికి, ఓటర్లలో అయోవుయుం నింపడానికి సృష్టించిన మిథ్యగానే అనుకోవాల్సి ఉంటుంది.    
 - ప్రవీణ్ రాయ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)
 
పెరగని మిత్రపక్షాల సంఖ్య
 కొన్ని మిత్రపక్షాలు కాంగ్రెస్‌ను వదలిపోవడం, సీనియుర్ నేతలు కొందరు ఎన్నికల్లో పోటీకి అరుుష్టత ప్రకటించడం ఈ లోక్‌సభ ఎన్నికల్లో యుూపీఏ కూటమి ఓటమి ఖాయువుని చెప్పడానికి సూచికలని భావిస్తున్నారు. కానీ, ఒడిశాలో బీజేడీ, బెంగాల్‌లో తృణవుూల్ వంటి పాత మిత్రపక్షాలను బీజేపీ వుళ్లీ తనవైపుకు తిప్పుకోలేకపోరుుంది. బీజేపీతో చేతులు కలిపి తావుు కూడా లబ్ధి పొందే స్థారుులో మోడీ గాలి లేదని ఈ పార్టీలు భావిస్తుండడమే దీనికి కారణం. కాకపోతే అచేతనంగా ఉన్న బీజేపీలో మోడీ కొత్త ఊపు తీసుకొచిచ్చారని, ఎన్నికలకు పార్టీని వేగంగా సన్నద్ధం చేయుగలిగారని వూత్రం చెప్పవచ్చు.   

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రస్థానం
1980లో అవతరించిన బీజేపీ పూర్వరూపం.. భారతీయ జనసంఘ్ (బీజేఎస్). అంతకు ముందు 1977-79 కాలంలో జనతా పార్టీలో బీజేఎస్ అంతర్భాగంగా ఉండేది.
 
 నిజమా, మిథ్యా?
 ‘మోడీ’ గాలి రాజకీయు వాస్తవవూ లేక మిథ్యా అనే విషయూన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సర్వేల్లో ప్రధాని పదవికి తొలి ప్రాధాన్యం మోడీకే అని చెప్పేవారి సంఖ్య అధికంగా ఉండటానికి, ఆయున ఎన్నికల ర్యాలీలకు భారీగా జనం తరలి రావడానికి దేశవ్యాప్తంగా వీస్తోందంటున్న మోడీ ప్రభంజనాన్నే కారణంగా చూపిస్తున్నారు. ఒక్క సీఎన్‌ఎన్-ఐబీఎన్ సర్వే మినహా మిగిలిన అన్ని సర్వేలూ మోడీ ప్రభంజనం ఉందన్నాయి. ఈ సర్వేల్లో చెప్పిన ఆధారాలు పూర్తిగా లోపరహితమైనవి కాదని రెండు కారణాల వల్ల చెప్పవచ్చు. గత రెండు సార ్వత్రిక ఎన్నికల్లో చేసిన సర్వేల్లో పలు పార్టీలకు వస్తాయుని అవి అంచనా వేసిన సీట్లు వాస్తవానికి దూరంగా ఉన్నారుు. ఆ అంచనాలు బీజేపీకి చాలా వరకు అనుకూలంగా ఉన్నారుు. సీట్ల సంఖ్యపై అంచనాలు వేయడంలో పొరపాట్లు బహువుుఖ పోటీలు జరిగే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల విషయుంలో చోటుచేసుకుంటాయి. ఈసారి కూడా ఈ రాష్ట్రాల్లో బీజేపీకి వురీ ఎక్కువ సీట్లు వస్తాయుని అంచనా వేశారు.
 
 అదీగాక, వుుస్లింల ఓట్లు బీజేపీయేతర పార్టీలకు అనుకూలంగా సమీకృతం కావడం, ఓట్ల శాతాన్ని సీట్లలోకి వూర్చడంలో వచ్చే తేడాల వంటి అంశాలను సర్వేలు విస్మరించారుు. అలాగే కర్ణాటకలో బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య కూడా వాస్తవ విరుద్ధంగా, వురీ ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా దాటలేదు. దానిపై జనంలో వ్యతిరేకత రావడానికి ఇంకా సవుయువుుంది. ఇక సర్వే సంస్థల జోస్యాలు చాలాసార్లు తప్పని తేలడంతో వాటిపై వివుర ్శలు వెల్లువెత్తుతున్నారుు. కొన్ని సర్వే సంస్థలపై ఇటీవల ఢిల్లీలో జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో తేలిందేవుంటే- అవి తవు క్లరుుంట్లకు అనుకూలంగా సరే ్వ ఫలితాలను వూర్చి ప్రకటిస్తాయని! ఫలితంగా కొన్ని కొన్ని ఎన్నికల సర్వే సంస్థలు, మీడియూ సంస్థల పనితీరుపై జనంలో అనువూనాలు చెలరేగారుు. ఈ సంస్థలు చెబుతున్న మోడీ ప్రభంజనం ఎంత వరకు వాస్తవవునే ప్రశ్న కూడా ఉదరుుంచింది. ఓటర్ల నాడి తెలుసుకోవడానికి అత్యుత్తవు సాధనంగా గతంలో భావించిన సర్వేల ఫలితాలను, వాటి నిష్పాక్షికతను ఇప్పుడు పూర్తిగా నవ్ములేం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement