నరేంద్ర మోడీది బాల్యవివాహం: వెంకయ్య నాయుడు | Do not rake leaders' private life in public , BJP tells Congress | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీది బాల్యవివాహం: వెంకయ్య నాయుడు

Published Fri, Apr 11 2014 4:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

నరేంద్ర మోడీది బాల్యవివాహం: వెంకయ్య నాయుడు - Sakshi

నరేంద్ర మోడీది బాల్యవివాహం: వెంకయ్య నాయుడు

ఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి,  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కాకుండా, వ్యక్తి గత విషయాలపై దృష్టి పెట్టినట్లు కనబడుతోందన్నారు. మోడీ బాల్య వివాహం చేసుకున్నారని వెంకయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన 10 ఏళ్ల పాలనపై చర్చించకుండా.. వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతుందని వెంకయ్య విమర్శించారు. ఈ తరహా విధానమే కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శమన్నారు. తెలంగాణ ప్రాంతంలో మోడీ, సుష్మా స్వరాజ్ సభలను నిర్వహిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

టీడీపీతో తమ పార్టీ పెట్టుకున్న పొత్తుతో మంచి ఫలితాలు వస్తాయని వెంకయ్య తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి 50 సీట్లు వస్తాయని వెంకయ్య జోస్యం చెప్పారు.  ఎలక్షన్ నామినేషన్ కాలమ్ లో యశోదాబెన్ ను తన భార్యగా మోడీ తొలిసారి పేర్కొనడంపై వివాదం రాజుకుంది. ఇప్పటి వరకూ ఆమె పేరును దాచి ఉంచిన  మోడీ.. తాజాగా  ఆమెను ఎందుకు తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement