
భార్య పేరును మోడీ ఎందుకు దాస్తున్నారు?
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇప్పటి వరకు రాజకీయ దాడి చేసిన దిగ్విజయ్ .. ‘నీ భార్య పేరును ఎందుకు దాస్తున్నారు’ అంటూ మోడీని పశ్నించారు. మోడీ భార్య పేరు యశోదా బెన్ . ఆమె ఇప్పుడు సాధారణ మహిళగా తన జీవితాన్నిఅద్దె ఇంటిలోని సాగిస్తుందని దిగ్విజయ్ తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆమెకు కనీసం బంగ్లాలో ఉండేందుకు ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్నారు. ఆమె వివరాలు చెప్పకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారని విమర్శించారు. 'మహిళలంటే కనీస గౌరవం మీ హృదయంలో ఉంటే ఎన్నికల దరఖాస్తులో భార్య పేరును ఎందుకు పూరించలేదన్నారు.
ఈ అంశానికి సంబంధించి మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఆమెను ఎందుకు దాచిపెడుతున్నారని చెప్పాలన్నారు. జశోదా బెన్ ను మోడీ పెళ్లి చేసుకున్నారా లేదా? అలా అయితే విడాకులిచ్చారా? ఆమెతో ఎందుకు కలిసి ఉండట్లేదు ? తన వైవాహిక స్థితిని ఆయన ఎందుకు ప్రకటించలేదని దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.