
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని మోదీ భార్య జశోదాబెన్‌తో మాట్లాడారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకునేందుకు బయలుదేరిన సీఎం మమత కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్‌కతా నుంచి ధన్‌బాద్ వెళ్లేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ‘విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్‌కు సీఎం మమత చీర బహూకరించారు’అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, మమత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment