'అబ్బాయిలు రిజెక్టెడ్ మెటీరియల్....' | Anandiben calls boys rejected material | Sakshi
Sakshi News home page

'అబ్బాయిలు రిజెక్టెడ్ మెటీరియల్....'

Published Fri, Jun 20 2014 2:17 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

'అబ్బాయిలు రిజెక్టెడ్ మెటీరియల్....'

'అబ్బాయిలు రిజెక్టెడ్ మెటీరియల్....'

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఉంటే వివాదాలకు తక్కువేమీ ఉండదు.

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఉంటే వివాదాలకు తక్కువేమీ ఉండదు. ఆమె అహ్మాదాబాద్ లోని ఒక స్కూల్ డే ఫంక్షన్ కి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'అమ్మాయిలు బాగా చదువుకోవాలి. చదివి ముందుకు రావాలి' అంటూ మొదలుపెట్టిన ఆనందీబెన్ చదువుకుంటే 'మంచి మొగుళ్లు వస్తారు' అన్నారు. అంతటితో ఆగకుండా 'మీరెంత ఎక్కువ చదువుకుంటే మీకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయిలు భర్తలుగా వస్తారు' అని కూడా అన్నారు.

'చదువుకోని అబ్బాయిలను ఎవరూ పెళ్లి చేసుకోరు. వారిని అమ్మాయిలు రిజెక్టు చేస్తారు. అలాంటి రిజెక్టెడ్ మెటీరియల్ కి పెళ్లికాదు' అని గుజరాత్ ముఖ్యమంత్రి అన్నారు. ఆమె ప్రసంగానికి చప్పట్లు బాగా పడ్డాయి. ఎందుకంటే ఆ స్కూలు ఆడపిల్లల స్కూలు.

కానీ గుజరాతీ అబ్బాయిలు మాత్రం మమ్మల్ని రిజెక్టెడ్ మెటీరియల్ అంటారా అని భగ్గుమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement