
న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ మధ్యప్రదేశ్ తదుపరి గవర్నర్‌గా నియమితులయ్యారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఆమెను గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించినట్టు రాష్ట్రపతి భవన్ ట్విట్టర్‌లో తెలిపింది. ఆనంది బెన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది.
2014లో నరేంద్రమోదీ గుజరాత్ అసెంబ్లీకి రాజీనామా చేసి.. ప్రధానమంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ తెరపైకి వచ్చారు. పటీదార్ రిజర్వేషన్ల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వల్ల ఆమె రెండేళ్లకు మించి సీఎం పదవిలో ఉండలేకపోయారు. ఆనంది బెన్ దిగిపోవడంతో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ రుపానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి.. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఓం ప్రకాశ్ కోహ్లి వ్యవహరిస్తున్నారు. 2016 నుంచి గుజరాత్ బాధ్యతలు అదనంగా చూస్తున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనంది బెన్ బాధ్యతలు చేపడితే.. గుజరాత్ పూర్తిస్థాయి గవర్నర్‌గా కోహ్లి కొనసాగుతారని తెలుస్తోంది.