హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న జైరాం ఠాకూర్
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్(52) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం వేడుకతో రిడ్జ్ మైదానం మొత్తం కషాయం జెండాలతో నిండిపోయింది.
హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపు అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిపై తర్జనభర్జనలు జరిపిన బీజేపీ ఆదివారం ఠాకూర్ పేరును ఖరారు చేసింది. ఠాకూర్ మండీ జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిమాచల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఠాకూర్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరికొందరు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
హిమాచల్‌ప్రదేశ్ కేబినేట్ మంత్రులు వీరే..
- మహేంద్ర సింగ్
- సురేష్ భరద్వాజ్
- కిషన్ కపూర్
- అనిల్ శర్మ
- సర్వీన్ చౌదరి
- విపిన్ సింగ్ పర్మార్
- వీరేంద్ర కన్వర్
- బిక్రమ్ సింగ్
- గోబింద్ సింగ్
- రాజీవ్ సైజల్
Comments
Please login to add a commentAdd a comment