Jairam Thakur
-
హిమాచల్‌లో ఆ అంశాలే బీజేపీ కొంపముంచాయ్
అభ్యర్థుల్ని కాదు. నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రచారం, బీజేపీ జపించిన అభివృద్ధి మంత్రం, డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యూహం, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కున్న వ్యక్తిగత ఇమేజ్ ఇవేవీ హిమాచల్ ప్రదేశ్‌లో కమలదళాన్ని కాపాడలేకపోయాయి. స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో అధికార బీజేపీ చూపిన అలసత్వమే ఆ పార్టీ కొంపముంచింది. సరిగ్గా వాటినే కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఎక్కడికక్కడ మోదీకి కౌంటర్లు ఇవ్వడం కాంగ్రెస్‌కి కలిసొచ్చింది. కాంగ్రెస్ తన ప్రచారంలో పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, యాపిల్ రైతు సమస్యలు వంటివి లేవనెత్తుతూ వాటికి పరిష్కారాలను కూడా చూపించింది. రాష్ట్రంలో 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. వారంతా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఆందోళనలు చేస్తూ ఉంటే బీజేపీ చూసీ చూడనట్టు వ్యవహరించడం ఆ పార్టీని గట్టి దెబ్బ తీసింది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పునరుద్ధరణపైనే తొలి సంతకం పెడతానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. ఎగువ హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత కీలకమైన యాపిల్ లాబీ బీజేపీపై అసంతృప్తిగా ఉంది. యాపిల్ పళ్లను నిల్వ చేసే కారా్టన్లపై జీఎస్టీ పెంపు, అదానీ గ్రూప్‌కి తక్కువ ధరకే యాపిల్స్‌ను అమ్ముకోవాల్సి రావడం వంటివి ప్రభుత్వ వ్యతిరేకతని పెంచాయి. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం కూడా మంచుకొండల్లో మంటల్ని రాజేయడం బీజేపీకి మైనస్‌గా మారింది. ఇండియన్ ఆర్మీలో హిమాచల్‌కు చెందిన 1.15 లక్షల మంది సేవలు అందిస్తూ ఉంటే మరో 1.30 లక్షల మంది రిటైర్డ్ అధికారులున్నారు. కాంట్రాక్ట్ పద్ధతుల్లో సైన్యంలో నియామకాలను తీవ్రంగా వ్యతిరేకించిన వీరంతా, ఈ పథకం రద్దుకు ప్రయత్నిస్తామన్న కాంగ్రెస్ వైపు తిరిగిపోయారు. నిరుద్యోగం, అధిక ధరలు కూడా ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీశాయి. బీజేపీకి రెబెల్స్ గండి బీజేపీ పరాజయానికి రెబెల్ అభ్యర్థులు, పార్టీలోని అంతర్గత పోరు కూడా కారణమే. దాదాపుగా 12 స్థానాల్లో బీజేపీ అసమ్మతి నేతలు పోటీలోకి దిగి బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టారు. విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ రెబెల్సే. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ మధ్య వర్గపోరు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం: సీఎం జైరాం ఠాకూర్
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జైరాం ఠాకూర్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ కేవలం 1% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిందని తెలిపారు. అంతేగాక రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ అతి తక్కువ ఓట్ షేర్‌తో విజయం సాధించిందని పేర్కొన్నారు. అయితే తాను ఎన్నికల ఫలితాలను గౌరవిస్తానని తెలిపారు. కాంగ్రెస్ త్వరలో తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోని, రాష్ట్రం కోసం పనిచేయడం ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు హిమాచల్‌లో బీజేపీ ఓటమిపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. చదవండి: Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ బంపర్ విక్టరీ.. ఎన్ని లక్షల మెజార్టీ అంటే.. -
Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా
షిమ్లా: గుజరాత్ ఎన్నికల్లో భారీ ప్రభంజనం సృష్టించిన బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్‌లో పరాజయాన్ని చవిచూసింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించి ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక ఆప్.. కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై జైరాం ఠాకూర్ గెలుపొందారు. కాంగ్రెస్ విజయ కేతనం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. ఇప్పటికే 37 స్థానాల్లో స్పష్టమైన విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 23 స్థానాల్లో గెలుపొందగా.. 3 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నారు. చదవండి: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్.. ప్రమాణం ఎప్పుడంటే? -
ప్రతిపక్షాలది స్వార్థ రాజకీయం
మండి: ప్రతిపక్షాలది స్వార్ధంతో కూడిన రాజకీయమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వ నిర్వహణలో ప్రస్తుతం రెండు నమూనాలున్నాయని, అందరితో కలిసి, అందరి నమ్మకం, అందరి కృషితో సాగే నమూనా తమది కాగా, సొంత ప్రయోజనాలు, స్వకుటుంబ స్వార్ధం, సొంతవారి ఎదుగుదల లక్ష్యంగా సాగే నమూనా విపక్షానిదని దుయ్యబట్టారు. అదేవిధంగా రెండు రకాల ఆలోచనాధోరణులుంటాయని, తమది వికాస్(అభివృద్ధి) ఆలోచన కాగా, విపక్షానిది విలంబ్(జాప్యం) ఆలోచన అని విమర్శిఃచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జైరామ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లైన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన సోమవారం పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం(కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం) వల్ల అనేక ప్రయోజనాలు అందాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో పలు అభివృద్ది ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, వివిధ పథకాల అమలు జోరందుకుందని వివరించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని రూ. 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను ఆరంభించారు. దీంతో పాటు రూ.11,581 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపన చేశారు. -
హృదయ విదారకం: 13 శవాలు వెలికితీత.. ఇంకా శిథిలాల కింద?
సిమ్లా/హిమాచల్ ప్రదేశ్: కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టిపెళ్లలు తొలగించిన రక్షణా బృందాలు.. ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీశాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో 13 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. క్షతగాత్రులను సమీప భవానగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా హిమాచల్‌ప్రదేశ్ రెఖాంగ్ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగి పడిన విషయం విదితమే. ఆ సమయంలో రహదారిపై సుమారుగా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. మిగతా వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఇండో- టిబెటన్ బార్డర్ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ గురువారం వెల్లడించారు. ఘటనాస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. కాగా మృతుల్లో ఎక్కువ మంది కిన్నౌర్ జిల్లాకు చెందిన వారే ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ వారి ఆచూకీ కోసం అధికారుల వద్దకు వెళ్లిన బంధువులు హృదయ విదాకరంగా విలపిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు చూసి కంటతడి పెడుతున్నారు. #HimachalPradesh : Landslide in Kinnaur: 40 feared trapped | @CMOFFICEHP #TheStatesman #kinnaur #himachallandslide #Himachal @TheStatesmanLtd (Source: Unknown) pic.twitter.com/tEhqpsUX4R — Vineet Gupta (@statesmannet) August 11, 2021 Drone footage of Kinnaur landslide. A long stretch mark can be seen. People are being rescued from the bus trapped in landslide.#savekinnaur #HimachalLandSlide pic.twitter.com/DCfs3r6cxi — News Leak Centre (@CentreLeak) August 12, 2021 किन्नौर हिमाचल में बुधवार को पहाड़ दरकने से मलबे में दबे लोगों की तलाशने में @NDRFHQ और @ITBP_official जवान, जान दांव पर लगा लगातार सर्च अभियान चला रहे। अब तक मलबे से 13 शव व 13 लोगों को जिंदा निकाला जा चुका है।@JagranNews @mygovhimachal #HimachalLandSlide #kinnaurlandslide pic.twitter.com/qotclyJZgF — amit singh (@Join_AmitSingh) August 12, 2021 -
హిమాచల్ పోలీసులు, సీఎం భద్రత సిబ్బంది మధ్య కొట్లాట
-
వైరల్: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ
సిమ్లా: భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది, హిమాచల్ ప్రదేశ్ సీఎం భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త చివరకు పెద్దదై చేయి చేసుకునే వరకూ వెళ్లడం కలకలం రేపింది. సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సిమ్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు విమానాశ్రయం బయట గుమికూడారు. అయితే అక్కడ ప్రజలు గుమిగూడడాన్ని సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కులు ఎస్పీ, సీఎం భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అదనపు ఎస్పీ బ్రిజేష్ సూద్‌ను, కులు ఎస్పీ గౌరవ్ సింగ్ చెంప దెబ్బ కొట్టాడు. ఈ సమయంలో ఎస్పీ గౌరవ్ సింగ్‌ని సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్ కాలితో తన్నారు. కాగా, ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుండు తెలిపారు. ప్రస్తుతం కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ (సెంట్రల్ రేంజ్) మధుసూదన్ చూసుకుంటారని అన్నారు. అలాగే బ్రిజేష్ సూద్ స్థానంలో పండోహ్ 3వ బెటాలియన్ చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు తెలిపారు. చదవండి: వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం -
మంత్రితో పాటు కుమార్తెలకు కరోనా
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 131 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సుఖ్ రాం చౌదరితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలకు కూడా కోవిడ్ ఉన్నట్లు తేలింది. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. కరోనా చికిత్స నిమిత్తం మంత్రి, వారి కుమార్తెలను సిమ్లాలోని కొవిడ్ కేర్ సెంటరుకు తరలించినట్లు వైద్యఆరోగ్యశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ ఆర్డీ థీమాన్ తెలిపారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సీఎం జైరాం ఠాకూర్ ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1965కి చేరుకోగా, 13 మంది మరణించారు. రాష్ర్ట వ్యాప్తంగా అత్యధికంగా సోలన్ ప్రాంతంలో 383, మండిలో 145 కేసులు నమోదయ్యాయి. -
ధోనిపై రాజకీయ దుమారం
సిమ్లా: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రాజకీయ వివాదంలో చిక్కుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన టీమిండియా ఫినిషర్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. హిమాచల్‌కు వచ్చిన ఎంఎస్ ధోనికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేయడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ‘టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఎంఎస్ ధోని మన రాష్ట్ర పర్యటనకు రావడం చాలా ఆనందంగా ఉంది. అతను మన విశిష్ట అతిథి, మర్యాదలు చేయడం మన ధర్మం. అయితే ధోనికి ప్రత్యేక భద్రత కల్పించామే తప్పా.. అతడి వ్యక్తిగత ఖర్చులు ప్రభుత్వం భరించలేద’ని హిమాచల్ సీఎం స్పష్టంచేశారు. దీంతో వివాదం సధ్దుమణిగింది. అసలేం జరిగిందంటే.. ఎంఎస్ ధోని తన సతీమణి సాక్షితో కలిసి ప్రయివేట్ షూటింగ్లో పాల్గొనడానికి హిమాచల్ ప్రదేశ్ వచ్చారు. వక్తిగత పర్యటనకు వచ్చిన ధోనికి ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాట్లు చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ’టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని అంటే మాకు చాలా గౌరవమే. అతడి వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వం ఖర్చు చేయడం సరికాదు. అతడు పేద అథ్లెట్ కాదు, పన్నులు చెల్లించే సంపన్నుడు అలాంటి ఆటగాడికి ప్రభుత్వం ఖర్చు చేయడం సిగ్గుచేట’ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
హిమాచల్ ప్రదేశ్ సీఎం భార్యకు కుమారస్వామి ఫోన్
సాక్షి, బెంగళూరు : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ భార్య సాధనా ఠాకూర్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో తప్పిపోయిన మైసూరుకు చెందిన మహిళను కర్ణాటకకు చేర్చడంలో సాయం చేసినందుకుగానూ ధన్యవాదాలు తెలిపేందుకు ఫోన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సాధనా ఠాకూర్ కన్నడలో మాట్లాడటంతో తనకెంతో సంతోషం కలిగిందన్నారు. అసలు విషయమేమిటంటే... మైసూరుకు చెందిన ముప్పై ఏళ్ల మహిళను రెండేళ్ల క్రితం ఆమె భర్త వదిలేశాడు. దాంతో మతిస్థిమితం కోల్పోయిన ఆమె.. అతడిని వెదుక్కుంటూ హిమాచల్ ప్రదేశ్ చేరుకున్నారు. కానీ కన్నడ తప్ప వేరే భాష రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్లుగా ఆమెను గమనిస్తున్న స్థానికులు అతి కష్టం మీద ఆమెను కర్ణాటకకు చెందినవారిగా గుర్తించారు. దీంతో స్థానిక ప్రభుత్వాధికారులకు సమాచారం ఇవ్వడంతో టీవీ చానెళ్లలో ఆమె గురించి ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సాధనా ఠాకూర్ సదరు మహిళను సీఎం అధికారిక నివాసానికి పిలిపించుకున్నారు. సాధన కూడా కన్నడలో మాట్లాడటంతో ఆ మహిళకు తన వివరాలు చెప్పడం తేలికైంది. సదరు మహిళ గురించి సాధనా ఠాకూర్ కర్ణాటక ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. తర్వాత ఆమెను సురక్షితంగా కర్ణాటకకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే షిమ్లా వెళ్లి వారిని కలుస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ మహిళను ప్రభుత్వ హోంకు తరలించినట్లు తెలిపారు. కుమారస్వామి ఫోన్ చేయడం గురించి మాట్లాడుతూ.. తాను కన్నడిగనే అని తెలుసుకున్న కుమారస్వామి ఎంతో సంతోషించారని, ఆయన ఎంతో దయాగుణం కలవారని సాధనా ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి : బీజేపీ కొత్త సీఎం ఎవరి అల్లుడో తెలుసా..? -
కొలువుదీరిన జైరామ్ ప్రభుత్వం
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. షిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి అలుపెరగకుండా కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. దాదాపు 30వేల మంది పార్టీ కార్యకర్తలు సాంప్రదాయ దుస్తులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త, పాతల మిశ్రమం కేబినెట్ కూర్పులో అనుభవజ్ఞులైన వారితోపాటు కొత్తవారికీ చోటుకల్పించారు. ఐదుగురు గతంలో మంత్రులుగా చేసిన వారు కాగా.. ఆరుగురు కొత్తవారు. సీఎం సహా ఆరుగురు రాజ్‌పుత్‌లు, ముగ్గురు బ్రాహ్మణులు, ఓ ఎస్టీ, ఇద్దరు ఓబీసీలతో మంత్రివర్గ కూర్పు చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సర్వీన్ చౌదరి తాజా కేబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా ఉన్నారు. రాజీవ్ బిందాల స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. గతనెల్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పీకే ధుమాల్ ఓడిపోవటంతో పార్టీ జైరాంను శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసింది. అనుకోకుండా కాఫీ దుకాణంలో.. షిమ్లాలోని ‘ఇండియన్ కాఫీ హౌజ్’ చాలా ఫేమస్. ఇక్కడి కాఫీకి వీరాభిమానుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్నప్పుడు ఇక్కడికి తరచూ కాఫీ తాగేందుకు మోదీ వచ్చేవారు. పార్టీ నాయకులు, జర్నలిస్టులతో ఇక్కడే ఇష్టాగోష్టి జరిపేవారు. కాగా, జైరామ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధాని మోదీకి ఆ రోడ్డుగుండా వెళ్తున్నపుడు ఆ దుకాణంలో మధురజ్ఞాపకాలు గుర్తొచ్చినట్లున్నాయి. భద్రతను పక్కనబెట్టి దుకాణం ముందు కాన్వాయ్‌ను ఆపి.. కాఫీ తాగారు. ఈ పరిణామంతో దుకాణ యజమానులతోపాటు రోడ్డుపై ఉన్నవారూ ఆశ్చర్యపోయారు. -
హిమాచల్ సీఎంగా ఠాకూర్ ప్రమాణం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్(52) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం వేడుకతో రిడ్జ్ మైదానం మొత్తం కషాయం జెండాలతో నిండిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపు అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిపై తర్జనభర్జనలు జరిపిన బీజేపీ ఆదివారం ఠాకూర్ పేరును ఖరారు చేసింది. ఠాకూర్ మండీ జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిమాచల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఠాకూర్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరికొందరు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. హిమాచల్‌ప్రదేశ్ కేబినేట్ మంత్రులు వీరే.. మహేంద్ర సింగ్ సురేష్ భరద్వాజ్ కిషన్ కపూర్ అనిల్ శర్మ సర్వీన్ చౌదరి విపిన్ సింగ్ పర్మార్ వీరేంద్ర కన్వర్ బిక్రమ్ సింగ్ గోబింద్ సింగ్ రాజీవ్ సైజల్ -
బీజేపీ కొత్త సీఎం ఎవరి అల్లుడో తెలుసా..?
సాక్షి, మైసూరు: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రాం ఠాకూర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్న ఆయన కర్ణాటక అల్లుడు. అవును నిజంగానే ఆయన కన్నడ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. జై రామ్ వివాహం చేసుకుంది శివమొగ్గకు చెందిన సాధాన అనే డాక్టర్‌ను. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లడంతో 1980లో జైపూర్‌లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీలో ఆమె వైద్యవిద్యను అభ్యసించారు. ఏబీవీపీలో కూడా చురుగ్గా ఉన్న ఆమె ఆ సమయంలోనే ఠాకూర్‌ను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజపుత్ర వంశ నేత అయిన జై రాం ఇటీవల వరుసగా ఐదోసారి హిమాచల్ ప్రదేశ్‌లోని సిరజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అక్కడ ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రేమ్ కుమార్ ధుమాల్ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఆ స్థానంలో అనూహ్యంగా జై రాం ఠాకూర్ ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. ఆయన పేరును కూడా ధుమాలే ప్రకటించారు. -
కాబోయే సీఎం సతీమణి.. బెంగళూరు వనితే
సాక్షి, బెంగళూరు: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత, కాబోయే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కు కర్ణాటకతో అనుబంధం ఉంది. ఆయన సతీమణి డాక్టర్ సాధనా రావ్ కర్ణాటకకు చెందిన వారు. ప్రస్తుతం వీరి కుటుంబం సిమ్లాలో నివాసం ఉంటోంది. వివరాలు.... బెంగళూరుకు చెందిన డాక్టర్ సాధనా రావ్ జైపూర్‌లో ఎంబీబీఎస్ చదివే సందర్భంలో ఆమె ఏబీవీపీలో చురుకైన కార్యకర్త. ఇదే సందర్భంలో జమ్మూ– కాశ్మీర్ ఏబీవీపీ విభాగంలో కార్యకర్తగా ఉన్న జైరామ్ ఠాకూర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. వివాహం అనంతరం జైరామ్ ఠాకూర్ రాజకీయాల్లో నిమగ్నం కాగా, సాధనారావ్ తన వైద్య వృత్తిని కొనసాగించారు. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. త్వరలోనే బెంగళూరు వస్తాను: సాధన కాగా, కర్ణాటక అన్నా ముఖ్యంగా బెంగళూరు అన్నా తనకెంతో గౌరవం, అభిమానం ఉన్నాయని డాక్టర్ సాధనా రావ్ చెబుతున్నారు. తనకు అవకాశం లభిస్తే త్వరలోనే బెంగళూరు వస్తానని చెప్పారు. ‘మా తాతగారు బెంగళూరులోనే ఉండేవారు. తండ్రి జైపూర్‌లో ఉండడంతో నా విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తాతగారు బెంగళూరులో ఉండడం వల్ల సెలవుల్లో అక్కడికే వచ్చేవాళ్లం. ప్రస్తుతం బెంగళూరు చాలా మారిపోయిందని, అభివృద్ధి చెందిందని స్నేహితుల ద్వారా విన్నాను. త్వరలోనే బెంగళూరు వస్తాను’ అని డాక్టర్ సాధన తెలిపారు. -
హిమాచల్ కొత్త సీఎంగా జైరాం
సిమ్లా: మంచుకొండలతో కనువిందు చేసే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్‌ను బీజేపీ శాసనసభాపక్షం ఆదివారం ఎన్నుకుంది. పార్టీలోని ప్రముఖులను కాదని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరాం ఠాకూర్‌ను సీఎం పీఠం వరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు గత సోమవారం వెలువడటం, బీజేపీ భారీ విజయాన్ని సాధించడం తెలిసిందే. మొత్తం 68 స్థానాలకుగాను బీజేపీకి 44, కాంగ్రెస్‌కు 21 సీట్లు వచ్చాయి. అయితే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధూమల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం ఎవరనే దానిపై ఇన్నాళ్లు ఉత్కంఠ నెలకొంది. జైరాం ఠాకూర్‌తోపాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ధూమల్ సహా పలువురి పేర్లు సీఎం రేసులో వినిపించాయి. చివరకు పార్టీ కేంద్ర కమిటీ నుంచి వచ్చిన పర్యవేక్షకులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ల అధ్యక్షతన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం సిమ్లాలో జరిగింది. రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్ పేరును ఎమ్మెల్యేలు సురేశ్ భరద్వాజ్, మహేంద్ర సింగ్‌లు ప్రతిపాదించగా మిగిలినవారు బలపరిచారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని జైరాం కోరారు. గవర్నర్ పచ్చజెండా ఊపడంతో ఈ నెల 27న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని సీనియర్ నేతలు చెప్పారు. మండీ నుంచి తొలి ముఖ్యమంత్రి రాజ్‌పుత్ కులానికి చెందిన 52 ఏళ్ల ఠాకూర్ గతంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. నిరాడంబరుడిగా పేరుతెచ్చుకున్న ఆయన 2007 ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. హిమాచల్‌లో ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా బీజేపీని సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చింది ఠాకూరే. ప్రస్తుతం ఆయన మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయంగా, సీట్ల సంఖ్య పరంగా అత్యంత ప్రధానమైన మండీ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కాబోతున్న తొలి నాయకుడు ఈయనే. తాజా ఎన్నికల్లో బీజేపీ అక్కడ 9 స్థానాల్లో గెలుపొందింది. జైరాం చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆరెస్సెస్, ఏబీవీపీతో మంచి సంబంధాలు ఉండేవి. తొలిసారిగా 1993 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1998 నుంచి సిరాజ్ నుంచి ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూనే ఉన్నారు. -
హిమాచల్‌లో ఉత్కంఠకు తెర
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. కొత్త సీఎంగా జైరాం ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జైరాం ఠాకూర్‌ను తమ నాయకుడిగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సివచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు వినిపించినప్పటికీ చివరికి జైరాం ఠాకూర్ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. వివాదరహితుడిగా పేరున్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2007 నుంచి 2012 వరకు హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో జైరాం ఠాకూర్ పేరును ధూమల్ ప్రతిపాదించడం విశేషం. తన పేరును ధూమల్ ప్రతిపాదించగా జేపీ నడ్డా, శాంతకుమార్ మద్దతు తెలిపారని జైరాం ఠాకూర్ తెలిపారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. హిమాచల్‌లో ఉత్కంఠకు తెర -
హిమాచల్ ఉత్కంఠకు తెర