
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (ఫైల్ ఫోటో)
సిమ్లా: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రాజకీయ వివాదంలో చిక్కుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన టీమిండియా ఫినిషర్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. హిమాచల్‌కు వచ్చిన ఎంఎస్ ధోనికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేయడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.
‘టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఎంఎస్ ధోని మన రాష్ట్ర పర్యటనకు రావడం చాలా ఆనందంగా ఉంది. అతను మన విశిష్ట అతిథి, మర్యాదలు చేయడం మన ధర్మం. అయితే ధోనికి ప్రత్యేక భద్రత కల్పించామే తప్పా.. అతడి వ్యక్తిగత ఖర్చులు ప్రభుత్వం భరించలేద’ని హిమాచల్ సీఎం స్పష్టంచేశారు. దీంతో వివాదం సధ్దుమణిగింది.
అసలేం జరిగిందంటే..
ఎంఎస్ ధోని తన సతీమణి సాక్షితో కలిసి ప్రయివేట్ షూటింగ్‌లో పాల్గొనడానికి హిమాచల్ ప్రదేశ్ వచ్చారు. వక్తిగత పర్యటనకు వచ్చిన ధోనికి ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాట్లు చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ’టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని అంటే మాకు చాలా గౌరవమే. అతడి వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వం ఖర్చు చేయడం సరికాదు. అతడు పేద అథ్లెట్ కాదు, పన్నులు చెల్లించే సంపన్నుడు అలాంటి ఆటగాడికి ప్రభుత్వం ఖర్చు చేయడం సిగ్గుచేట’ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment