సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఆరుగురు... గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఉమ్మడి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సమక్షంలో దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య (డీవీవీఎస్) సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్‌కుమార్ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్ గౌడ్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన న్యాయమూర్తులకు పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా టి.అమర్‌నాథ్ గౌడ్ మాట్లాడుతూ... హైకోర్టు జడ్జిగా ఎంపిక కావటం ఆనందంగా ఉందని, ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిదన్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, తన గురువు అయిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేలా కృషి చేస్తానని అమర్‌నాథ్ గౌడ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్త...