
కేసీఆర్ ప్రమాణ స్వీకారం (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని అనధికార సమాచారం. తాము విజయం సాధిస్తే డిసెంబర్ 12నే ప్రమాణ స్వీకారం చేస్తానని మూడు నెలల క్రితమే కేసీఆర్ ప్రకటించారు. అయితే రేపు ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
ఈ సాయంత్రం టీఆర్‌ఎస్ శాసనసభపక్ష సమావేశం నిర్వహించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. శాసనసభపక్ష నాయకుడిగా కేసీఆర్‌ను ఎన్నుకునే అవకాశముంది. ఈరోజు సాయంత్రమే గవర్నర్ నరసింహన్‌ను కేసీఆర్ కలసి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానించాలని కోరతారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment