ప్రొటెం స్పీకర్గా పతివాడ ప్రమాణ స్వీకారం | Pativada Narayana Swamy Naidu takes oath as protem Speaker | Sakshi
Sakshi News home page

ప్రొటెం స్పీకర్గా పతివాడ ప్రమాణ స్వీకారం

Published Thu, Jun 19 2014 9:30 AM | Last Updated on Sat, Jun 2 2018 4:30 PM

ప్రొటెం స్పీకర్గా పతివాడ ప్రమాణ స్వీకారం - Sakshi

ప్రొటెం స్పీకర్గా పతివాడ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెల్లిమర్ల శాసనసభ్యుడు పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కాగా తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి, సభ్యులతో ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు.

 సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ముందుగా సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఇతర సభ్యులందరితోనూ ప్రమాణాలు చేయించనున్నారు. మొత్తంమీద ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు ఫలితాలు ప్రకటించిన నెలా మూడు రోజుల తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈనెల 24వ తేదీ వరకూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement