జూన్ 2 కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖరరావు జూన్ 2 తేదిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2 తేదిన రోజునే కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
జూన్ 2 తేదిన మధ్యాహ్నం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పీటీఐకి వెల్లఢించారు. 119 సీట్లున్న అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కేసీఆర్ ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.