సాక్షి,హైదరాబాద్: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఫిలింనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం(జూన్ 26) ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి తనతో పాటు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
‘మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఫిలింనగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశా. ఫ్లైయాష్ స్కామ్ చేయలేదని ప్రమాణం చేయాలని కోరాను. నువ్వు నీతి మంతుడివి అయితే ఎందుకు రాలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు పొన్నం.
తడి బట్టలతో హుజురాబాద్‌లో హనుమాన్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశాను.నీ నిజాయితీ ఎందుకు నిరూపించుకోవడం లేదు పొన్నం ప్రభాకర్. వే బ్రిడ్జిలో కొలతలు తక్కువ వచ్చాయి. దీనికి ప్రూఫ్ ఉంది. వే బిల్ సరిగా లేదు.
రవాణా శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా? రోడ్లు నాశనం చేస్తున్నారు. ఫ్లైయాష్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్నాడు’అని కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ప్రమాణం సందర్భంగా బ్లాక్ బుక్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్‌రెడ్డి రాశారు.
తాము అధికారంలోకి వచ్చాక పొన్నంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రమాణం చేసేందుకుగాను బుధవారం ఉదయం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కౌశిక్‌రెడ్డి అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి గుడికి బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment