
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(65) ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. గత నెలలో బీజేపీ తరఫున యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన కారణంగా ఆయన ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చాంబర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.