ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం
►నిన్న రాజీనామా, ఇవాళ ప్రమాణ స్వీకారం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న అనూహ్యంగా రాజీనామా చేసిన ఆయన 24 గంటలలోపే తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించారు. రాష్ట్ర గవర్నర్ త్రిపాఠీ ఈ రోజు ఉదయం 10 గంటలకు నితీశ్ కుమార్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ కూడా ప్రమాణం చేశారు. కాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో లాలు యాదవ్ తనయుడు తేజస్విని యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని నితీశ్ యత్నించిన విషయం తెలిసిందే.
అయితే, తేజస్వి మంత్రివర్గం నుంచి తప్పుకోడంటూ, అసలు నితీశ్‌ను ముఖ్యమంత్రిని చేసింది తానేనని లాలూ వ్యాఖ్యలతో బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆర్జేడీతో నితీశ్ తెగదెంపులు చేసుకుని జేడీయూ...బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు నితీశ్ కు మద్దతు ఇస్తామని బీజేపీ ప్రకటించిన బీజేపీ ఈ మేరకు గవర్నర్‌కు లేఖ కూడా అందచేసిన విషయం విదితమే.