లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం | telugu MPs of 16th Lok Sabha take oath | Sakshi
Sakshi News home page

లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం

Published Thu, Jun 5 2014 1:20 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

telugu MPs of 16th Lok Sabha take oath

న్యూఢిల్లీ : 16వ లోక్సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు  తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎల్ కే అద్వానీ, సోనియాగాంధీ, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుట్టా రేణుకా, వెలుగపల్లి వరప్రసాద్ రెడ్డి ఆంగ్లంలో, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే టీడీపీకి చెందిన ఎంపీలు అశోక్ గజపతిరాజు ఆంగ్లంలో, జేసీ దివాకర్ రెడ్డి తెలుగులో, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణం చేశారు. కాగా ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement