
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన జయ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఆర్కేనగర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఆర్కేనగర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గతవారం జరిగిన ఉప ఎన్నికలో జయ ఆర్కే నగర్ నుంచి లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సచివాలయంలోని స్పీకర్ పి. ధన్పాల్.. జయతో ప్రమాణం చేయించారు.
పన్నీరు సెల్వం, విశ్వనాథన్, వైద్యలింగం తదితర ముఖ్యులు మాత్రమే జయ వెంట ఉన్నారు. కాగా స్పీకర్ కార్యాలయంలోకి ఫొటోగ్రాఫర్లు సహా మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. జయ ప్రమాణం చేస్తున్న సమయంలో స్పీకర్ కార్యాలయం వెలపల ఏఐడీఎంకే కార్యకర్తలు సందడిచేశారు.