సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 222 స్థానాలకు గాను 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. తరువాతి స్థానాల్లో కాంగ్రెస్(79), జేడీఎస్(38). ఎవరికీ సంపూర్ణ మోజారిటీ లేని కారణంగా ముఖ్యమంత్రి పదవిపై పెద్ద హైడ్రామానే నడిచింది. నిమిష నిమిషానికి కన్నడ రాజకీయం మారుతూ వచ్చింది. మేము అధికారం చేపడతామంటే.. కాదు మేమే చేపడతామంటూ బీజేపీ, కాంగ్రెస్-జేడీయూ పోటీలు పడ్డాయి. అయితే బుధవారం సాయంత్రం ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఆ రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ ఆహ్వనించారు. ఆయన పంపిన ఆహ్వాన లేఖ చూడండి.
Comments
Please login to add a commentAdd a comment