సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల దరిమిలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. మంగళవారం సాయంత్రమే రాజ్‌భవన్‌కు వెళ్లనున్న ఆయన.. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు రాజీనామా లేఖను అందజేస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు సిద్ధరామయ్యను ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరేఅవకాశంఉంది.
సరిగ్గా ఐదేళ్లు: కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా 2013, మే13న ప్రమాణం చేసిన సిద్దరామయ్య.. ఐదేళ్లపాటు(2018, మే15 వరకు) పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో చాముండేశ్వరి, బదామి స్థానాల నుంచి బరిలో నిలవగా... బదామిలో మాత్రమే గెలుపొందారు. ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజా తీర్పును గౌరవిస్తామ’’ని సిద్దూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్-జేడీఎస్‌ల ప్రభుత్వం?: కర్ణాటకలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సంసిద్ధులయ్యాయి. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు ఫలవంతం అయ్యాయని కాంగ్రెస్ జాతీయ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. ఫలితాల్లో బీజేపీకి 104 స్థానాలు, కాంగ్రెస్ 77, జేడీఎస్ 39, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు ఇద్దరూ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన దరిమిలా ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతున్నది....
Comments
Please login to add a commentAdd a comment