Vajubhai Rudabhai Vala
-
లవ్ ఇన్ బెంగళూరు..!
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల ఐక్యతకు వేదికగా మారింది. సంకీర్ణ కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాలు హాజరైనా.. వేదికపై ప్రాంతీయ పార్టీల అధినేతల సందడి ప్రధానంగా కనిపించింది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. కన్నడనాట బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ని ఏపీ సీఎం చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. కాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సోనియా, మాయావతిల ఆత్మీయ ఆలింగనం అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నాను. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి. రాహుల్‌ను ప్రశంసించిన బాబు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రాహుల్ దగ్గరికెళ్లిన చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. సాధారణంగా రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్‌తో అభివాదం చేసే చంద్రబాబు.. ఈ వేదికపై మాత్రం చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరించటం ఆసక్తిరేపింది. మమత, మాయావతి, అఖిలేశ్‌లతోనూ కబుర్లు చెప్తూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువసేపు మమతా బెనర్జీతో మాట్లాడుతూ కనిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వేదికపైకి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. హాజరైన ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పంజాబ్ సీఎం అమరీందర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐల ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, శరద్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, డీఎంకే నేత కనిమొళి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రమే కుమారస్వామిని కలిసి అభినందించి వెళ్లారు. వేదికపై అపురూప దృశ్యాలు శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి వేదిక చివర్లో కూర్చుని మాట్లాడుకోవటం, అఖిలేశ్, మాయావతిల కబుర్లు, మాయావతి, సోనియా ఆత్మీయ ఆలింగనం వంటి ఆసక్తికర దృశ్యాలన్నీ వేదికపై కనిపించాయి. ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కార్యక్రమానికి ముందు.. ప్రమాణస్వీకారం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘అన్ని ప్రాంతీయ పార్టీలతో మేం టచ్‌లో ఉంటాం. తద్వారా దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మేం కలిసి పనిచేసేందుకు వీలుంటుంది’ అని మమత అన్నారు. ముభావంగా వజూభాయ్! కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్ వజూభాయ్ వాలా కార్యక్రమంలో ముభావంగా కనిపించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. కుమారస్వామి గవర్నర్‌కు వీడ్కోలు చెప్పలేదు. వర్షంతో ఇబ్బందులు ప్రమాణ స్వీకారోత్సవానికి వర్షం ఇబ్బంది కలిగించింది. మధ్యాహ్నం 1.30 నుంచే బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుందా? అన్న అనుమానం కలిగింది. ఒక దశలో విధానసౌధ లోపల కార్యక్రమం నిర్వహించాలని ఆలోచించారు. సాయంత్రంకల్లా వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాంగణంలోనే ప్రమాణం నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో విధానసౌధ ఎదుట భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. విధానసౌధ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళం నెలకొంది. నేతలకు ట్రాఫిక్ చిక్కులు ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న సోనియా, రాహుల్‌లు ఎయిర్‌పోర్టునుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జామ్ అయ్యాయి. నివాసం నుంచి విధానసౌధకు బయల్దేరిన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత సోనియా, రాహుల్ నేరుగా తమ ఎమ్మెల్యేలున్న హిల్టన్ హోటల్‌కు వెళ్లారు. వారందరితోనూ మాట్లాడారు. వారిని అభినందించారు. బలపరీక్ష పూర్తయ్యేంతవరకు ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. కన్నడ ప్రజల సాక్షిగా.. గవర్నర్ వజూభాయ్ కుమారస్వామితో ప్రమాణం చేయించారు. సంప్రదాయ దుస్తులైన ధోతీ, తెల్లని షర్టు ధరించిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. బుధవారం ఉదయమే కేపీసీసీ చీఫ్‌గా పరమేశ్వర రాజీనామా చేశారు. ఈ సంకీర్ణ సర్కారు శుక్రవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. ఆ తర్వాతే మిగిలిన మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం కుమారస్వామి కూడా ఒక్కొక్క నాయకుడి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన తన తల్లి చెన్నమ్మ పాదాలకు నమస్కారం చేశారు. కుమారస్వామి, డీకే శివకుమార్‌లు చేయిచేయి కలిపి కార్యకర్తలకు అభివాదం చేశారు. విధానసౌధ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది కార్యకర్తలు ప్రమాణస్వీకార వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పవార్, సోనియా, మాయావతి, రాహుల్, ఏచూరి, కుమారస్వామి, అఖిలేశ్ తదితరులు. ఆప్యాయంగా పలకరించుకుంటున్న మాయావతి, సోనియా. కుటుంబ సభ్యులతో కుమారస్వామి -
కర్ణాటక రాజకీయపై స్పందించిన రజనీకాంత్
-
బీజేపీపై రజనీకాంత్ విమర్శలు
సాక్షి, చెన్నై: కర్ణాటక రాజకీయ పరిణామాలపై సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం రజనీ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై రజనీ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని చూసిందని, కానీ, చివరకు న్యాయమే గెలిచిందని రజనీ వ్యాఖ్యానించారు. ‘కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాలు నడిచాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ గడువు కోరితే.. గవర్నర్ ఏకంగా 15 రోజుల సమయం ఇచ్చారు. అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని యత్నించారు. కానీ, చివరకు ఏం జరిగింది? న్యాయస్థానం జోక్యం చేసుకోవటంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగ్గ విషయం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యం వర్థిల్లింది. కర్ణాటకలో జరిగిన విషయాన్ని పాలకులందరూ గమనించాలి’ అని రజనీ పేర్కొన్నారు. ఎన్నికల గురించి... 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై రజనీ కాంత్ స్పష్టత ఇవ్వలేకపోయారు. ‘ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇంకా పార్టీని ప్రకటించలేదు కదా. అయినా అన్నింటికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇక పొత్తుల గురించి ఇప్పుడే మాట్లడటం సరికాదు. పార్టీ ప్రకటించలేదు కాబట్టే కమల్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేకపోయా. భవిష్యత్తులో మాత్రం సమావేశాలకు ఖచ్ఛితంగా హాజరవుతా. కావేరీ జలాల బోర్డు, కర్నాటక ఆధీనంలో కాకుండా.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుంది’ అని రజనీ తెలిపారు. -
కర్ణాటక గవర్నర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలతో అటు జేడీఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. యెడ్యూరప్ప తన రాజీనామా నిర్ణయం ప్రకటించగానే అసెంబ్లీలో మొదలైన సందడి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విధేయతలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా సరికొత్త రికార్డు సృష్టించారు. రెండు వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని యత్నించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని, పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పైగా ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకే చెందిన వ్యక్తిని నియమించారు. బీజేపీ పట్ల ఆయనకున్న విశ్వాసం అంతా ఇంతా కాదు. బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఆయన శతవిధాల ప్రయత్నించారు. బహుశా ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్ వాలా అని పేరు పెట్టుకోవాలేమో. ఎందుకంటే ఆయన కంటే విశ్వాసం, విధేయతను ప్రదర్శించేవారు ఉండరనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అలవాటేనని మహారాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ విభాగం నేత అమిత్ మాలవియా తెలిపారు. -
కర్నాటకం: బోపయ్యతో బేఫికర్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను గవర్నర్ వాజుభాయ్ వాలా ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు బీఎస్ యడ్యూరప్పను ఆయన కాపాడటమే దీనికి కారణమని తెలుస్తోంది. 2009-13 మధ్యకాలంలో కర్ణాటక శాసనసభా స్పీకర్‌గా బోపయ్య పనిచేశారు. 2011, అక్టోబర్‌లో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పపై తిరుగుబాటు చేశారు. దీంతో శాసనసభలో యడ్యూరప్ప అవిశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది. స్పీకర్‌గా ఉన్న బోపయ్య తిరుగుబాటు చేసిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి యెడ్డీ సర్కారును కాపాడారు. బోపయ్య నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించగా, సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో ఆయన అతి వేగంగా స్పందించారని వ్యాఖ్యానించింది. సర్వత్రా ఉత్కంఠ.. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌కు నియమించివుంటారన్న అనుమానాన్ని కాంగ్రెస్, జేడీఎస్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా యడ్యూరప్ప సర్కారుకు ఆయన అనుకూలంగా వ్యవహరించే అవకాశముందని ఆరోపించాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేటప్పుడు అత్యంత అనుభవశాలి అయిన ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్వీ దేశ్‌పాండే అత్యంత సీనియర్ సభ్యుడు. ఆయనను పక్కనపెట్టేసి బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కర్ణాటక అసెంబ్లీలో రేపు ఏం జరుగుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్య
-
కర్ణాటక: ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠ రేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో రేపు బలనిరూపణకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఉత్తర్వులు వెలువరించిన 5 నిమిషాల్లోనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ వాజూభాయ్ వాలా నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం సీనియర్ అయిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ పార్టీ నేత ఆర్వీ దేశ్‌పాండేను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజే బోపయ్యను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరాజ్‌పేట స్థానం నుంచి బోపయ్య గెలిచారు. 2009లోనూ ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. నియమ నిబంధనల ప్రకారమే ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలోనూ ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేశారు. -
కర్ణాటక గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బల పరీక్ష పూర్తి కాకముందే ఓ ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్ చేశారు. దీంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరగ్గా.. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ‘కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ వజుభాయ్ వాలా నామినేట్ చేశారు. కానీ, బీజేపీ అభ్యర్థి యెడ్యూరప్ప ఇంకా బలాన్ని నిరూపించుకోలేదు. అంతలోనే గవర్నర్ ఇలా ఎమ్మెల్యేని నామినేట్ చేయటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి బల పరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వండి’ అంటూ సంయుక్త పిటిషన్లో కాంగ్రెస్-జేడీఎస్‌లు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉంటే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో గత రాత్రి వాదనలు జరిగాయి. పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామన్న బెంచ్.. యెడ్డీ ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని, గవర్నర్ విచక్షణ అధికారాలను ప్రశ్నించలేమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను.. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేట్ పిటిషన్‌తో కలిపి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. (సుప్రీం కోర్టులో అర్ధరాత్రి హైడ్రామా) మా ఎమ్మెల్యేలు లొంగరు: నటి రమ్య -
యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించలేము
-
నేడు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
-
ఇద్దరికీ అపాయింట్మెంట్.. ఎటూతేల్చని గవర్నర్
-
కర్ణాటక గవర్నర్ కింకర్తవ్యం!
-
కర్ణాటక గవర్నర్ కింకర్తవ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ, 37 సీట్లతో తృతీయ పార్టీగా అవతరించిన జేడీఎస్ పార్టీలు వేర్వేరుగా రాష్ట్ర గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాయి. తమకు జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు ఉందని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ముందు ప్రకటించుకున్నారు. ఇక జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని, తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందీ గవర్నరే. ఆయన విధుల్లో జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగంలోని 361 అధికరణం కింద కోర్టులకు లేవు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే 1952లో మొదటిసారి స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నర్ విధులను నిర్దేశిస్తున్న రాజ్యాంగ అధికరణం, సుప్రీంకోర్టు తీర్పు యథాతథంగా వర్తిస్తోంది. అయితే కోర్టులు గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై తమ అభిప్రాయలను వ్యక్తం చేయవచ్చు. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సందర్భాల్లో ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమికి అతిపెద్ద పార్టీగా అవిర్భవించిన పార్టీకన్నా ఎక్కువ సీట్లు వస్తే, ఆ కూటమికే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పలు సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయి. అలాలేని సందర్భాల్లో అతిపెద్ద పార్టీని ఆహ్వానించడమే సమంజసమని, అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దేనని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. 1989లో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాజీవ్ గాంధీని అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ప్రభుత్వం ఏర్పాటుకు అహ్వానించారు. 1996లో లోక్‌సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ ప్రభుత్వం ఏర్పాటుకు అటల్ బిహారి వాజ్‌పేయిని ఆహ్వానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి సంప్రదాయాన్నే కొనసాగించాల్సిందిగా బీజేపీ కోరవచ్చు. ఇక్కడే బీజేపీకి పెద్ద సమస్య వచ్చి పడింది. గోవాలో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని కాదని, ఎన్నికల అనంతరం ఇతర పార్టీ సభ్యుల మద్దతు తమకే ఎక్కువగా ఉన్నందున తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరింది. బీజేపీకి ఆ ఎన్నికల్లో 13 సీట్లే వచ్చాయి. కోర్టులో కూడా ఇదే వాదనలు వినిపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందే కాదు, ఎన్నికల అనంతరం ఏర్పడిన పార్టీల కూటమిని కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ విధి అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వాదించారు. గత ఏడాది జరిగిన మణిపూర్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లురాగా, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. అప్పుడు గవర్నర్‌గా ఉన్న నజ్మా హెప్తుల్లా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 30 సీట్లకుపైగా మద్దతు ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 60 సీట్లుగల అసెంబ్లీలో ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 31 మంది సభ్యుల మద్దతు లభించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీలను ఉదాహరణగా తీసుకుంటే కర్ణాటక గవర్నర్ కూడా జేడీఎస్–కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. అందుకని యడ్యూరప్ప తెలివిగా జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు తనకుందని మెలిక పెట్టారు. ఆ వర్గాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఇద్దరికీ అపాయింట్మెంట్.. ఎటూతేల్చని గవర్నర్
సాక్షి, బెంగళూరు: ఒకవైపు అతిపెద్ద పార్టీ.. రెండోవైపు అత్యధికమంది సభ్యులున్న కూటమి.. నిర్ణయాధికారి గవర్నర్ కోర్టులో బంతి! ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ రాజ్‌భవన్ తలుపుతట్టిన ఇరు పక్షాలతోనూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సాదరంగా ఆహ్వానించారు. నాయకులు చెప్పిన విషయాలను సావధానంగా ఆలకించారు. అయితే, అవకాశం ఎవరికి కలిపించాలనేదానిపై మాత్రం ఎటూతేల్చలేదు. ఉత్కంఠ నడుమ‘‘రెండు రోజుల్లోనే గవర్నర్ సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారు..’’ అని రాజ్‌భవన్ వర్గాల నుంచి సమాచారం అందింది. జోరుగా క్యాంప్ రాజకీయాలు: ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ ఆహ్వానించని గవర్నర్... అందుకు రెండు రోజుల గడువు కోరడంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీకలకు భారీ ప్రయత్నాలు సాగిస్తున్నది. దీంతో అప్రమత్తమైన కుమారస్వామి.. తన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే పనిలో పడ్డారు. ఇటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(104) అతిపెద్ద పార్టీగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లోని కాంగ్రెస్(78), జేడీఎస్(38)లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈ కూటమికే మద్దతుపలుకుతుండటం గమనార్హం. -
గవర్నర్‌తో జేడీఎస్-కాంగ్రెస్ బృందం భేటీ
సాక్షి, బెగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని జేడీఎస్-కాంగ్రెస్‌లు గవర్నర్ చెప్పాయి. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం రాజ్‌భవన్ వద్ద నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న విషయాన్ని గవర్నర్‌కు స్పష్టం చేశామని, సంబంధిత తీర్మానాలు కూడా సమర్పించామని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర చెప్పారు. ‘కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నది. ఆయనను(స్వామిని) ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం. ఏ విషయమైంది రెండు రోజుల్లో చెబుతానని గవర్నర్ అన్నారు’’ అని సిద్దరామయ్య తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల్లో మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. -
గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన బీజేపీ అభ్యర్థనను గవర్నర్ స్వీకరించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం మాత్రం పలకకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం బయటికొచ్చిన యడ్యూరప్ప బృందం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. నూటికి నూరు శాతం బలాన్ని నిరూపించుకుంటాం’’ అని చెప్పారు. యడ్యూరప్పతోకలిసి గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి అనంతకుమార్, బీజేపీ నేతలు శ్రీరాములు తదితరులు ఉన్నారు. తొలుత బీజేపీ నేతలను కలిసిన గవర్నర్.. తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ నేతలకు టైమిచ్చారు. -
బీజేపీ ఎదురుదాడి.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో దూసుకుపోతోన్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నాలు ముమ్మరం చేసింది. నిమిషనిమిషానికి పరిణామాలు మారుతున్నవేళ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హుటాహుటిన బెంగళూరుకు పయనమయ్యారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక హక్కు లేదన్న బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప.. అతి పెద్ద పార్టీ అయిన తమకే గవర్నర్ అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో షా రాక ప్రాధాన్యం సంతరించుకుంది. షా వెంట కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా బెంగళూరుకు వస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీలికలకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అవసరమైన వ్యూహరచనతోపాటు అమలును కూడా స్వయంగా పర్యవేక్షించేందుకే బీజేపీ చీఫ్ అమిత్ షా బెంగళూరుకు వస్తున్నట్లు వినికిడి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎవరికి అవకాశమిస్తారన్నది కీలకంగా మారింది. -
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయం రసవత్తర మలుపులు తిరుతుగుతున్నది. మోదీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న బీజేపీకి కాంగ్రెస్ ఊహించని షాకిచ్చింది. 38 స్థానాలను గెలుచుకున్న జనతాదళ్(సెక్యూలర్) పార్టీ.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కర్ణాటక గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతూ జేడీఎస్ అధినేత కుమారస్వామి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. ‘‘సార్.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి టైమ్ ఇస్తే మిమ్మల్ని కలుస్తాను. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో మీరు టైమిస్తారని ఆశిస్తున్నాను’ అని కుమారస్వామి లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
కర్ణాటక రాజ్‌భవన్ వద్ద మారిన సీన్
సాక్షి, బెంగళూరు: గార్డెన్ సిటీ నడిమధ్యలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అటు కాంగ్రెస్-జేడీయూల కూటమి, ఇటు బీజేపీ.. ఇద్దరూ గవర్నర్ అపాయింట్మెంట్ను కోరారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప డిమాండ్ చేయగా... ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని కాంగ్రెస్-జేడీయూ నేతలు కోరుతున్నారు. ఈ పరస్పర విరుద్ధప్రకటనల నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం దాకా రాజ్‌భవన్ వద్ద సాధారణపరిస్థితులే ఉన్నా.. సాయంత్రానికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరు వర్గాల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠనెలకొంది. సిద్దరామయ్య రాజీనామా చేయడానికి వెళ్లినప్పుడు కూడా ఆయన కారును మాత్రమే లోనికి అనుమతించి, మిగతావాటిని రాజ్‌భవన్ గేటు బయటే నిలిపేయడం గమనార్హం. -
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు గవర్నర్ షాక్
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీనేతలు ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత గడువుకు కంటే ముందే కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకోవడానికి వెళ్లిన పీసీసీ చీఫ్ పరమేశ్వరకు చేదు అనుభవం ఎదురైంది. మద్దతుదారుల జాబితాతో వెళ్లిన ఆయనకు.. రాజ్‌భవన్‌లోకి అనుమతి లభించలేదు. దీంతో ఆయన కంగుతిన్నారు. చాలాసేపు అక్కడే వేచిచూసిన పరమేశ్వర.. చివరికి గవర్నర్ సందేశంతో వెనుదిరిగారు. ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడనందున ఇప్పుడప్పుడే తాను ఎవరినీ కలవబోనని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. వాస్తవానికి జేడీఎస్-కాంగ్రెస్ నేతల బృందంతో సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ ఆ సమయం కంటే ముందే వజుభాయ్‌ని కలిసేందుకు పరమేశ్వర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
సిద్దరామయ్య రాజీనామా..
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల దరిమిలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. మంగళవారం సాయంత్రమే రాజ్‌భవన్‌కు వెళ్లనున్న ఆయన.. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు రాజీనామా లేఖను అందజేస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు సిద్ధరామయ్యను ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరేఅవకాశంఉంది. సరిగ్గా ఐదేళ్లు: కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా 2013, మే13న ప్రమాణం చేసిన సిద్దరామయ్య.. ఐదేళ్లపాటు(2018, మే15 వరకు) పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో చాముండేశ్వరి, బదామి స్థానాల నుంచి బరిలో నిలవగా... బదామిలో మాత్రమే గెలుపొందారు. ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజా తీర్పును గౌరవిస్తామ’’ని సిద్దూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల ప్రభుత్వం?: కర్ణాటకలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సంసిద్ధులయ్యాయి. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు ఫలవంతం అయ్యాయని కాంగ్రెస్ జాతీయ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. ఫలితాల్లో బీజేపీకి 104 స్థానాలు, కాంగ్రెస్ 77, జేడీఎస్ 39, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు ఇద్దరూ గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన దరిమిలా ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతున్నది.... -
కర్ణాటక: వజుభాయ్ నిర్ణయమే కీలకం
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో చివరికి హంగ్ ఏర్పడింది. ఏ ఒక్క పార్టీ పూర్తిమెజారిటీ సాధించకపోగా, బీజేపీ(104సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్(77), జేడీఎస్(40), ఇతరులు(2) స్థానాలను కైవసం చేసుకున్నారు. గత పరిణామాల నేపథ్యంలో ముందే మేలుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి చక్రంతిప్పే ప్రయత్నం చేసింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా వ్యూహాలు అమలుచేసింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. జేడీఎస్ కురువృద్ధుడు దేవేగౌడకు ఫోన్‌చేసి కలిసిపనిచేద్దామని కోరారు. ఇందుకు గౌడ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇరుపార్టీల నేతలు కలిసి మంగళవారం సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నారు. గవర్నర్ విజుభాయ్ ఏం చేస్తారో?: హంగ్ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనేదానిపై కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. గుజరాత్‌కు చెందిన వజుభాయ్.. బీజేపీ ఎమ్మెల్యేగా బహుకాలం సేవలందించారు. 2014లో కేంద్రం ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపింది. సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రివాజుగా వస్తున్నప్పటికీ.. ఆ సంఖ్య కంటే ‘కాంగ్రెస్-జేడీఎస్’ కూటమి స్థానాలు ఎక్కువ కావడంతో గవర్నర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, తాము పెద్ద పార్టీగా ఏర్పడిన పక్షంలో.. ఒకవేళ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రకటన చేస్తే ఏమినటే ప్రశ్న ఉత్పన్నంకాకమానదు. మీడియా సమావేశాలు రద్దు: ఫలితాల ట్రెండ్స్ తొలి దశలో బీజేపీ గెలుస్తోందన్నట్లు రావడంతో ఆ పార్టీ కార్యాలయాల్లో సందడివాతావరణం కనిపించింది. తీరా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేటప్పటికి సీన్ రివర్స్ అయింది. దీంతో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్న బీజేపీ పెద్దలు.. అనూహ్యంగా దానిని రద్దుచేసుకున్నారు. ఫలితాలపై స్పందించేందుకు కాంగ్రెస్ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించాలనుకుంది. కానీ పొత్తుకు జేడీఎస్ అంగీకరించడంతో చివరినిమిషంలో ప్రెస్‌మీట్ రద్దుచేసుకుంది.