ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: కుమారస్వామి | JDS Chief Kumaraswamy Seeks Governor Appointment | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: కుమారస్వామి లేఖ

Published Tue, May 15 2018 4:58 PM | Last Updated on Wed, May 16 2018 6:54 PM

JDS Chief Kumaraswamy Seeks Governor Appointment - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయం రసవత్తర మలుపులు తిరుతుగుతున్నది. మోదీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న బీజేపీకి కాంగ్రెస్‌ ఊహించని షాకిచ్చింది. 38 స్థానాలను గెలుచుకున్న జనతాదళ్‌(సెక్యూలర్‌) పార్టీ.. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కర్ణాటక గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతూ జేడీఎస్‌ అధినేత కుమారస్వామి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు.

‘‘సార్‌.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి టైమ్‌ ఇస్తే మిమ్మల్ని కలుస్తాను. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో మీరు టైమిస్తారని ఆశిస్తున్నాను’ అని కుమారస్వామి లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్‌ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement