karnataka governor
-
MUDA scam: సిద్ధూ మెడకు ‘ముడా’ ఉచ్చు
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్యతనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీవిచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గేప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని నిలిపేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై మరోమారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏడీహెచ్‌ఎం) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ కోణంలో కుమారస్వామికి గవర్నర్ పిలుపు కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఏడీహెచ్‌ఎం తన పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా సోమవారం సాయంత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించేది, లేనిది తెలియాల్సిఉంది. గతవారం యడ్యూరప్పను సీఎం చేసిన ఇదే కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై జేడీయూ-కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఫలితాంగా మే 19న అసెంబ్లీలో బలపరీక్షలో జరగడం, డివిజన్ ఓటింగ్‌కు ముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే గవర్నర్.. కుమారస్వామినా ఆహ్వానించడం తెలిసిందే. ఈ నెల 23న బెంగళూరులో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
కర్ణాటక గవర్నర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలతో అటు జేడీఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. యెడ్యూరప్ప తన రాజీనామా నిర్ణయం ప్రకటించగానే అసెంబ్లీలో మొదలైన సందడి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విధేయతలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా సరికొత్త రికార్డు సృష్టించారు. రెండు వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని యత్నించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని, పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పైగా ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకే చెందిన వ్యక్తిని నియమించారు. బీజేపీ పట్ల ఆయనకున్న విశ్వాసం అంతా ఇంతా కాదు. బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఆయన శతవిధాల ప్రయత్నించారు. బహుశా ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్ వాలా అని పేరు పెట్టుకోవాలేమో. ఎందుకంటే ఆయన కంటే విశ్వాసం, విధేయతను ప్రదర్శించేవారు ఉండరనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అలవాటేనని మహారాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ విభాగం నేత అమిత్ మాలవియా తెలిపారు. -
గవర్నర్ అనే నేను!
-
కర్ణాటక గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బల పరీక్ష పూర్తి కాకముందే ఓ ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్ చేశారు. దీంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరగ్గా.. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ‘కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ వజుభాయ్ వాలా నామినేట్ చేశారు. కానీ, బీజేపీ అభ్యర్థి యెడ్యూరప్ప ఇంకా బలాన్ని నిరూపించుకోలేదు. అంతలోనే గవర్నర్ ఇలా ఎమ్మెల్యేని నామినేట్ చేయటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి బల పరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వండి’ అంటూ సంయుక్త పిటిషన్లో కాంగ్రెస్-జేడీఎస్‌లు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉంటే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో గత రాత్రి వాదనలు జరిగాయి. పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామన్న బెంచ్.. యెడ్డీ ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని, గవర్నర్ విచక్షణ అధికారాలను ప్రశ్నించలేమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను.. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేట్ పిటిషన్‌తో కలిపి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. (సుప్రీం కోర్టులో అర్ధరాత్రి హైడ్రామా) మా ఎమ్మెల్యేలు లొంగరు: నటి రమ్య -
కర్ణాటక గవర్నర్‌పై సుప్రీంకు రాంజెఠ్మలానీ
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక వ్యవహారంలో న్యాయపోరాటం తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పేరొందిన న్యాయకోవిదుడైన సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు తాజాగా ముందుకొచ్చారు. బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యక్తిగత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ఆయన ఈ మేరకు పిటిషన్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా సవాలు చేస్తూ ఈ కేసులో వ్యక్తిగతంగా ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ.. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని వెంటనే నిలిపేయాలని కోరుతూ ఆ పార్టీలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. అయితే, గురువారం మధ్యాహ్నం రెండు గంటలలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను తమకు సమర్పించాలని యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని, యడ్యూరప్ప ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినప్పటికీ.. అసెంబ్లీలో ఆయన బలనిరూపణ చేసుకునే వరకు కర్ణాటక ప్రభుత్వం విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాం జెఠ్మలానీ సైతం గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కర్ణాటక గవర్నర్ పంపిన ఆహ్వానం ఇదే..
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 222 స్థానాలకు గాను 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. తరువాతి స్థానాల్లో కాంగ్రెస్(79), జేడీఎస్(38). ఎవరికీ సంపూర్ణ మోజారిటీ లేని కారణంగా ముఖ్యమంత్రి పదవిపై పెద్ద హైడ్రామానే నడిచింది. నిమిష నిమిషానికి కన్నడ రాజకీయం మారుతూ వచ్చింది. మేము అధికారం చేపడతామంటే.. కాదు మేమే చేపడతామంటూ బీజేపీ, కాంగ్రెస్-జేడీయూ పోటీలు పడ్డాయి. అయితే బుధవారం సాయంత్రం ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఆ రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ ఆహ్వనించారు. ఆయన పంపిన ఆహ్వాన లేఖ చూడండి. -
ఇద్దరికీ అపాయింట్మెంట్.. ఎటూతేల్చని గవర్నర్
-
కర్ణాటక గవర్నర్ కింకర్తవ్యం!
-
కర్ణాటక గవర్నర్ కింకర్తవ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ, 37 సీట్లతో తృతీయ పార్టీగా అవతరించిన జేడీఎస్ పార్టీలు వేర్వేరుగా రాష్ట్ర గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాయి. తమకు జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు ఉందని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ముందు ప్రకటించుకున్నారు. ఇక జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని, తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందీ గవర్నరే. ఆయన విధుల్లో జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగంలోని 361 అధికరణం కింద కోర్టులకు లేవు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే 1952లో మొదటిసారి స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నర్ విధులను నిర్దేశిస్తున్న రాజ్యాంగ అధికరణం, సుప్రీంకోర్టు తీర్పు యథాతథంగా వర్తిస్తోంది. అయితే కోర్టులు గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై తమ అభిప్రాయలను వ్యక్తం చేయవచ్చు. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సందర్భాల్లో ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమికి అతిపెద్ద పార్టీగా అవిర్భవించిన పార్టీకన్నా ఎక్కువ సీట్లు వస్తే, ఆ కూటమికే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పలు సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయి. అలాలేని సందర్భాల్లో అతిపెద్ద పార్టీని ఆహ్వానించడమే సమంజసమని, అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దేనని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. 1989లో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాజీవ్ గాంధీని అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ప్రభుత్వం ఏర్పాటుకు అహ్వానించారు. 1996లో లోక్‌సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ ప్రభుత్వం ఏర్పాటుకు అటల్ బిహారి వాజ్‌పేయిని ఆహ్వానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి సంప్రదాయాన్నే కొనసాగించాల్సిందిగా బీజేపీ కోరవచ్చు. ఇక్కడే బీజేపీకి పెద్ద సమస్య వచ్చి పడింది. గోవాలో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని కాదని, ఎన్నికల అనంతరం ఇతర పార్టీ సభ్యుల మద్దతు తమకే ఎక్కువగా ఉన్నందున తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరింది. బీజేపీకి ఆ ఎన్నికల్లో 13 సీట్లే వచ్చాయి. కోర్టులో కూడా ఇదే వాదనలు వినిపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందే కాదు, ఎన్నికల అనంతరం ఏర్పడిన పార్టీల కూటమిని కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ విధి అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వాదించారు. గత ఏడాది జరిగిన మణిపూర్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లురాగా, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. అప్పుడు గవర్నర్‌గా ఉన్న నజ్మా హెప్తుల్లా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 30 సీట్లకుపైగా మద్దతు ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 60 సీట్లుగల అసెంబ్లీలో ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 31 మంది సభ్యుల మద్దతు లభించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీలను ఉదాహరణగా తీసుకుంటే కర్ణాటక గవర్నర్ కూడా జేడీఎస్–కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. అందుకని యడ్యూరప్ప తెలివిగా జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు తనకుందని మెలిక పెట్టారు. ఆ వర్గాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఇద్దరికీ అపాయింట్మెంట్.. ఎటూతేల్చని గవర్నర్
సాక్షి, బెంగళూరు: ఒకవైపు అతిపెద్ద పార్టీ.. రెండోవైపు అత్యధికమంది సభ్యులున్న కూటమి.. నిర్ణయాధికారి గవర్నర్ కోర్టులో బంతి! ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ రాజ్‌భవన్ తలుపుతట్టిన ఇరు పక్షాలతోనూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సాదరంగా ఆహ్వానించారు. నాయకులు చెప్పిన విషయాలను సావధానంగా ఆలకించారు. అయితే, అవకాశం ఎవరికి కలిపించాలనేదానిపై మాత్రం ఎటూతేల్చలేదు. ఉత్కంఠ నడుమ‘‘రెండు రోజుల్లోనే గవర్నర్ సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారు..’’ అని రాజ్‌భవన్ వర్గాల నుంచి సమాచారం అందింది. జోరుగా క్యాంప్ రాజకీయాలు: ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ ఆహ్వానించని గవర్నర్... అందుకు రెండు రోజుల గడువు కోరడంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీకలకు భారీ ప్రయత్నాలు సాగిస్తున్నది. దీంతో అప్రమత్తమైన కుమారస్వామి.. తన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే పనిలో పడ్డారు. ఇటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(104) అతిపెద్ద పార్టీగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లోని కాంగ్రెస్(78), జేడీఎస్(38)లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈ కూటమికే మద్దతుపలుకుతుండటం గమనార్హం. -
గవర్నర్‌తో జేడీఎస్-కాంగ్రెస్ బృందం భేటీ
సాక్షి, బెగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని జేడీఎస్-కాంగ్రెస్‌లు గవర్నర్ చెప్పాయి. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం రాజ్‌భవన్ వద్ద నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న విషయాన్ని గవర్నర్‌కు స్పష్టం చేశామని, సంబంధిత తీర్మానాలు కూడా సమర్పించామని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర చెప్పారు. ‘కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నది. ఆయనను(స్వామిని) ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం. ఏ విషయమైంది రెండు రోజుల్లో చెబుతానని గవర్నర్ అన్నారు’’ అని సిద్దరామయ్య తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల్లో మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. -
గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన బీజేపీ అభ్యర్థనను గవర్నర్ స్వీకరించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం మాత్రం పలకకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం బయటికొచ్చిన యడ్యూరప్ప బృందం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. నూటికి నూరు శాతం బలాన్ని నిరూపించుకుంటాం’’ అని చెప్పారు. యడ్యూరప్పతోకలిసి గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి అనంతకుమార్, బీజేపీ నేతలు శ్రీరాములు తదితరులు ఉన్నారు. తొలుత బీజేపీ నేతలను కలిసిన గవర్నర్.. తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ నేతలకు టైమిచ్చారు. -
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయం రసవత్తర మలుపులు తిరుతుగుతున్నది. మోదీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న బీజేపీకి కాంగ్రెస్ ఊహించని షాకిచ్చింది. 38 స్థానాలను గెలుచుకున్న జనతాదళ్(సెక్యూలర్) పార్టీ.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కర్ణాటక గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతూ జేడీఎస్ అధినేత కుమారస్వామి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. ‘‘సార్.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి టైమ్ ఇస్తే మిమ్మల్ని కలుస్తాను. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో మీరు టైమిస్తారని ఆశిస్తున్నాను’ అని కుమారస్వామి లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
కర్ణాటక రాజ్‌భవన్ వద్ద మారిన సీన్
సాక్షి, బెంగళూరు: గార్డెన్ సిటీ నడిమధ్యలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అటు కాంగ్రెస్-జేడీయూల కూటమి, ఇటు బీజేపీ.. ఇద్దరూ గవర్నర్ అపాయింట్మెంట్ను కోరారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప డిమాండ్ చేయగా... ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని కాంగ్రెస్-జేడీయూ నేతలు కోరుతున్నారు. ఈ పరస్పర విరుద్ధప్రకటనల నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం దాకా రాజ్‌భవన్ వద్ద సాధారణపరిస్థితులే ఉన్నా.. సాయంత్రానికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరు వర్గాల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠనెలకొంది. సిద్దరామయ్య రాజీనామా చేయడానికి వెళ్లినప్పుడు కూడా ఆయన కారును మాత్రమే లోనికి అనుమతించి, మిగతావాటిని రాజ్‌భవన్ గేటు బయటే నిలిపేయడం గమనార్హం. -
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు గవర్నర్ షాక్
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీనేతలు ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత గడువుకు కంటే ముందే కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకోవడానికి వెళ్లిన పీసీసీ చీఫ్ పరమేశ్వరకు చేదు అనుభవం ఎదురైంది. మద్దతుదారుల జాబితాతో వెళ్లిన ఆయనకు.. రాజ్‌భవన్‌లోకి అనుమతి లభించలేదు. దీంతో ఆయన కంగుతిన్నారు. చాలాసేపు అక్కడే వేచిచూసిన పరమేశ్వర.. చివరికి గవర్నర్ సందేశంతో వెనుదిరిగారు. ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడనందున ఇప్పుడప్పుడే తాను ఎవరినీ కలవబోనని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. వాస్తవానికి జేడీఎస్-కాంగ్రెస్ నేతల బృందంతో సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ ఆ సమయం కంటే ముందే వజుభాయ్‌ని కలిసేందుకు పరమేశ్వర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
సిద్దరామయ్య రాజీనామా..
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల దరిమిలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. మంగళవారం సాయంత్రమే రాజ్‌భవన్‌కు వెళ్లనున్న ఆయన.. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు రాజీనామా లేఖను అందజేస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు సిద్ధరామయ్యను ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరేఅవకాశంఉంది. సరిగ్గా ఐదేళ్లు: కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా 2013, మే13న ప్రమాణం చేసిన సిద్దరామయ్య.. ఐదేళ్లపాటు(2018, మే15 వరకు) పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో చాముండేశ్వరి, బదామి స్థానాల నుంచి బరిలో నిలవగా... బదామిలో మాత్రమే గెలుపొందారు. ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజా తీర్పును గౌరవిస్తామ’’ని సిద్దూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల ప్రభుత్వం?: కర్ణాటకలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సంసిద్ధులయ్యాయి. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు ఫలవంతం అయ్యాయని కాంగ్రెస్ జాతీయ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. ఫలితాల్లో బీజేపీకి 104 స్థానాలు, కాంగ్రెస్ 77, జేడీఎస్ 39, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు ఇద్దరూ గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన దరిమిలా ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతున్నది.... -
కర్ణాటక: వజుభాయ్ నిర్ణయమే కీలకం
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో చివరికి హంగ్ ఏర్పడింది. ఏ ఒక్క పార్టీ పూర్తిమెజారిటీ సాధించకపోగా, బీజేపీ(104సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్(77), జేడీఎస్(40), ఇతరులు(2) స్థానాలను కైవసం చేసుకున్నారు. గత పరిణామాల నేపథ్యంలో ముందే మేలుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి చక్రంతిప్పే ప్రయత్నం చేసింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా వ్యూహాలు అమలుచేసింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. జేడీఎస్ కురువృద్ధుడు దేవేగౌడకు ఫోన్‌చేసి కలిసిపనిచేద్దామని కోరారు. ఇందుకు గౌడ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇరుపార్టీల నేతలు కలిసి మంగళవారం సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నారు. గవర్నర్ విజుభాయ్ ఏం చేస్తారో?: హంగ్ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనేదానిపై కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. గుజరాత్‌కు చెందిన వజుభాయ్.. బీజేపీ ఎమ్మెల్యేగా బహుకాలం సేవలందించారు. 2014లో కేంద్రం ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపింది. సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రివాజుగా వస్తున్నప్పటికీ.. ఆ సంఖ్య కంటే ‘కాంగ్రెస్-జేడీఎస్’ కూటమి స్థానాలు ఎక్కువ కావడంతో గవర్నర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, తాము పెద్ద పార్టీగా ఏర్పడిన పక్షంలో.. ఒకవేళ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రకటన చేస్తే ఏమినటే ప్రశ్న ఉత్పన్నంకాకమానదు. మీడియా సమావేశాలు రద్దు: ఫలితాల ట్రెండ్స్ తొలి దశలో బీజేపీ గెలుస్తోందన్నట్లు రావడంతో ఆ పార్టీ కార్యాలయాల్లో సందడివాతావరణం కనిపించింది. తీరా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేటప్పటికి సీన్ రివర్స్ అయింది. దీంతో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్న బీజేపీ పెద్దలు.. అనూహ్యంగా దానిని రద్దుచేసుకున్నారు. ఫలితాలపై స్పందించేందుకు కాంగ్రెస్ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించాలనుకుంది. కానీ పొత్తుకు జేడీఎస్ అంగీకరించడంతో చివరినిమిషంలో ప్రెస్‌మీట్ రద్దుచేసుకుంది. -
వాళ్లను షూట్ చేయాలి: కర్ణాటక గవర్నర్
సాక్షి, బెంగళూరు: పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ వర్ధంతి నిర్వహించేవారిని కాల్చి చంపాలని కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా బెంగళూరులో వ్యాఖ్యానించారు. కసబ్ లాంటి ఉగ్రవాదులు, దేశద్రోహులను పట్టుకున్న మూడ్రోజుల్లోనే ఉరిశిక్ష వేయాలన్నారు. భద్రతలో పటిష్టంగా ఉన్న ఇజ్రాయెల్ లాంటి దేశమే అభివృద్ధిచెందుతుందని పేర్కొన్నారు. భారత్‌లో పరిస్థితులు వేరని అన్నారు. ‘ కొందరు కసబ్ వర్ధంతి నిర్వహిస్తున్నారు. వారిని తుపాకీతో కాల్చి మృతదేహాలు దొరక్కుండా చేయాలి’ అని అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక గవర్నర్
తిరుమల: కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం స్వామిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించి హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో గవర్నర్‌కు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడుకొండలవాడిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని, విశ్వశాంతి కోసం ప్రార్థించానని, స్వామివారిని ఎన్నిసార్లు దర్శించినా ఇంకా చూడాలనే తపన ఉంటుందని చెప్పారు. తెలుగు గడ్డపై తిరుమల శ్రీవారి ఆలయం ఉండటం ప్రతి ఒక్క తెలుగువారి అదృష్టమని అన్నారు. -
గవర్నర్ మసాజ్ ఖర్చు నెలకు రూ.లక్ష
-
కర్ణాటక గవర్నర్ ఖర్చులపై దుమారం
బెంగళూరు: కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తొమ్మిది నెలల్లోనే వాజుభాయ్ వాలా చేసిన ఖర్చులు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కన్నడకు చెందిన ఓ న్యూస్ చానెల్ చేసిన దరఖాస్తుపై వాజుభాయ్ వాలా ఖర్చుల వివరాలు తాజాగా వెల్లడైయ్యాయి. ఇప్పటివరకూ వాజుభాయ్ రూ. 3.5 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ నివేదికలో స్పష్టమైంది. రాజ్ భవన్ మరమ్మతులకు కింద, విమాన ప్రయాణాల కింద ఆయన ఇంతటి భారీ మొత్తంలో ఖర్చుపెట్టినట్లు బహిర్గతమైంది. అయితే ఈ వివాదంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యాడ్యూరప్ప మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఆ వివాదం అనవరసరమైనదిగా ఆయన అభివర్ణించారు. గత సెప్టెంబర్ లో బీజేపీ ప్రభుత్వం వాజుభాయ్ వాలాను కర్ణాటక గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే. -
రబ్బర్ స్టాంపును కాను : గవర్నర్
బెంగళూరు : శాసన, రాజ్యాంగ వ్యవస్థలు నాణేనికి రెండు ముఖాలని, రాజ్ భవన్ ఎప్పటికీ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రం కాకూడదని కొత్త గవర్నర్ వజూభాయ్ రుఢాభాయ్ వాలా అన్నారు. తాను ఈ పదవిలో ఉన్నంత వరకు ప్రజా సంక్షేమం కోసం పాటు పడతానే తప్ప, ఎవరికో రబ్బర్ స్టాంపులా వ్యవహరించబోనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఆప్తుడైనప్పటికీ, ఇప్పుడు గవర్నర్ కనుక రాజ్యాంగ ఆశయాలను కాపాడాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్ భవన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా, ప్రజల కోసం ఉన్న కార్యాలయంలా తీర్చి దిద్దుతానని చెప్పారు. ఒక రాష్ట్రం సంక్షేమ ప్రాంతం కావాలంటే ఒకరి నుంచే సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరూ సహకారం అందించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి సూచనలివ్వడంతో పాటు మార్గదర్శనం చేయడం గవర్నర్ కర్తవ్యమన్నారు. ప్రధానికి ఆప్తుడైనందునే తనను గవర్నర్‌గా నియమించారనడం సరికాదని అన్నారు. గుజరాత్లో ఆర్థిక శాఖ మంత్రిగా 18 సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టానని వెల్లడించారు. కనుక ప్రజా సమస్యలేమిటో తనకు బాగా తెలుసునని చెప్పారు. సంక్షేమ రాష్ట్రం కావాలంటే నిర్ణీత వ్యవధిలో ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ప్రతి శాసన సభ్యుడు, మంత్రి భుజం భుజం కలిపినందున అభివృద్ధి సాధ్యపడిందని చెప్పారు. కర్ణాటకలోనూ అపార సహజ వనరులున్నాయని, ప్రభుత్వం కోరితే సలహాలు ఇస్తానని తెలిపారు. గత గవర్నర్ ఏం చేశారో, రాబోయే గవర్నర్ ఏం చేస్తారో...తనకు అవసరమని, కర్ణాటకలో తాను ఉన్నంత వరకు ప్రజల పక్షాన పని చేస్తానని వివరించారు. రాజ్ భవన్ అంటే కేవలం పుస్తక పఠనానికి, విశ్వ విద్యాలయాల స్నాతకోత్సవాలకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. గవర్నర్ ఎవరికో రబ్బర్ స్టాంపులా పని చేయరాదని చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అన్ని రకాల సహకారాలు అందిస్తానని తెలిపారు. చెడు దారిలో వెళుతుంటే హెచ్చరించడం తన కర్తవ్యమని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, ఎవరిపైనో పగ తీర్చుకోవడం....లాంటి ఉద్దేశాలు తనకు లేనే లేవని స్పష్టం చేశారు. కేంద్రానికి తొత్తుగా పని చేయడానికి తనను ఇక్కడికి పంపలేదంటూ, గవర్నర్ పదవిని నిబాయించే సామర్థ్యం తనకు ఉందని చెప్పారు. కర్ణాటకలో ఉన్నంత వరకు సమర్థంగా, నిష్పక్షపాతంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. అయితే బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కె.శంకర నారాయణన్ మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మిజోరాం గవర్నర్ గా వెళ్లేందుకు శంకర నారాయణన్ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దాంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. శంకర్ నారాయణన్ రాజీనామా చేసిన రెండు రోజులకు కొత్త గవర్నర్ ను నియమిస్తు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
కర్ణాటక గవర్నర్‌గా రోశయ్య ప్రమాణం
బెంగళూరు: తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య కర్ణాటక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక చీఫ్ జస్టిస్ డీ హెచ్ వాఘేలా ఆదివారం రోశయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ్ పదవీకాలం ముగియడంతో రోశయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.