
నన్నెవరూ పొమ్మనలేరు: హెచ్ ఆర్ భరద్వాజ
తాను పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందని వచ్చిన వార్తలను కర్ణాటక గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ తోసిపుచ్చారు.
బెంగళూరు: తాను పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందని వచ్చిన వార్తలను కర్ణాటక గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ తోసిపుచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భరద్వాజ.. రాజ్భవన్ను వీడాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గవర్నర్ రాజ్యాంగ పదవని, ఏ రాజకీయ పార్టీతోనూ గవర్నర్కు సంబంధం ఉండదని భరద్వాజ చెప్పారు.
తనను రాష్ట్రపతి నియమించారని, ఆయనకు తనను తొలగించే అధికారం ఉంటుందన్నారు. రాష్ట్రపతి భవన్ కొత్త గవర్నర్ను నియమించే వరకు రాష్ట్రాన్ని వదిలి పొమ్మని తననెవరూ ఆదేశించలేరన్నారు. ఆయన పదవీ కాలం జూన్ 29న ముగియనుంది.