కర్ణాటక గవర్నర్ ఖర్చులపై దుమారం
బెంగళూరు: కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తొమ్మిది నెలల్లోనే వాజుభాయ్ వాలా చేసిన ఖర్చులు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కన్నడకు చెందిన ఓ న్యూస్ చానెల్ చేసిన దరఖాస్తుపై వాజుభాయ్ వాలా ఖర్చుల వివరాలు తాజాగా వెల్లడైయ్యాయి. ఇప్పటివరకూ వాజుభాయ్ రూ. 3.5 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ నివేదికలో స్పష్టమైంది. రాజ్ భవన్ మరమ్మతులకు కింద, విమాన ప్రయాణాల కింద ఆయన ఇంతటి భారీ మొత్తంలో ఖర్చుపెట్టినట్లు బహిర్గతమైంది.
అయితే ఈ వివాదంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యాడ్యూరప్ప మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఆ వివాదం అనవరసరమైనదిగా ఆయన అభివర్ణించారు. గత సెప్టెంబర్ లో బీజేపీ ప్రభుత్వం వాజుభాయ్ వాలాను కర్ణాటక గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే.