‘అమ్మ’ కోసం కైలాస పర్వతం నుంచి..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుంటున్నారని, త్వరలోనే ఆమె డిశ్చార్జి కావడంతో పాటు విధులు నిర్వహిస్తారని బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చెప్పారు. జయలలిత కోసం కైలాస పర్వతంలోని మానసరోవరం సరస్సు నుంచి పవిత్ర జలాన్ని ప్రత్యేకంగా తీసుకువచ్చానని తెలిపారు.
లక్షలాదిమంది ప్రజల ప్రార్థనలు ఫలించాయని జయలలత ఆరోగ్యం ఉన్నారని విజయ్ చెప్పారు. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి తమిళనాడు సీఎంను పరామర్శిచారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని అన్నా డీఎంకే నేతలు చెప్పారు. అపోలో ఆస్పత్రి వైద్యులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. పలువురు వీఐపీలు ఆపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.