
చెన్నై, పెరంబూరు: తమిళనాడు సీఎం నటుడు విజయ్. ఏమిటీ ఆశ్చర్య పోతున్నారా? ఇదేంటీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిసామి కదా..? నటుడు విజయ్ అంటారేమిటీ అని అనుకుంటున్నారా? మనందరికీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిసామినే. అయితే నటుడు విజయ్ అభిమానులకు మాత్రం ఆమనే సీఎం. విజయ్‌కు తమిళనాడు దాటి ఇతర రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ అభిమాన గణం భారీగానే ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ముఖ్యంగా తమిళనాడులో విజయ్‌ను ఆయన అభిమానులు ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటుంటారు. ఆయన అభిమానులు ఏదోవిధంగా విజయ్‌ను ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ వార్తల్లోకి వెక్కడంతో పాటు ఆయనకు రాజకీయ రంగప్రవేశం గురించి గుర్తు చేస్తూనే ఉంటున్నారు. అలా మరోసారి తమిళనాడు సీఎం విజయ్ అంటూ పోస్టర్లను ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టర్‌లో ట్యాగ్‌లా కలెక్షన్ మాస్టర్ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్లు మరోసారి విజయ్‌ను వార్తల్లోకి నెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment