
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(69) కరోనా బారిన పడ్డాడు. కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లారు ఆయన.
స్టాలిన్‌కు తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తమిళనాడు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్‌లో పాల్గొని జాగ్రత్తగా ఉండాలని ట్విటర్ ద్వారా సీఎం స్టాలిన్ పిలుపు ఇచ్చారు.
తమిళనాడు గత కొంతరోజులుగా.. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్, సబ్ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. సుమారు 2వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి తమిళనాడులో.
இன்று உடற்சோர்வு சற்று இருந்தது. பரிசோதித்ததில் #COVID19 உறுதிசெய்யப்பட்டதையடுத்து தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன்.
— M.K.Stalin (@mkstalin) July 12, 2022
அனைவரும் முகக்கவசம் அணிவதோடு, தடுப்பூசிகளைச் செலுத்திக் கொண்டு, பாதுகாப்பாய் இருப்போம்.
Comments
Please login to add a commentAdd a comment