'రూ. 190 లకే సిమెంట్ బస్తా'
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని శుక్రవారం చెన్నైలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బస్తా సిమెంట్ రూ. 190లకే అందించనున్నట్లు తెలిపారు. సిమెంట్ బస్తా ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో పేద మధ్య తరగతి వర్గాలు ఇల్లు కట్టుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా వర్గాల వారికి తక్కవ ధరకే సిమెంట్ బస్తా అందించాలని ఉద్దేశ్యంతో జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రకటించారు. త్వరలో అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం అమ్మ పేరిట పలు పథకాలను ప్రారంభించారు. అమ్మ క్యాంటిన్లు, అమ్మ మెడికల్స్, అమ్మ వాటర్, అమ్మ కూరగాయలతోపాటు పలు పథకాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలు తమిళ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.