​కేక్‌ మిగిలిపోయిందా? ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది  | Home Made Simple Kitchen Hacks That Helps Like Magic | Sakshi
Sakshi News home page

​కేక్‌ మిగిలిపోయిందా? ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది 

Published Wed, Dec 6 2023 12:26 PM | Last Updated on Tue, Dec 12 2023 11:00 AM

Home Made Simple Kitchen Hacks That Helps Like Magic - Sakshi

  • సెలెరీని సిల్వర్‌ ఫాయిల్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో పెడితే రెండు మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది.
  • చీమ‌లు ఎక్కువగా ఉన్న చోట దాల్చిన చెక్క పొడిని నీటితో క‌లిపి స్ప్రే చేయ‌డంతో చీమలు పారిపోతాయి. కాఫీ పౌడర్‌ లేదా మిరియాల పొడి నీళ్లలో కలిపి ఆ ప్రాంతంలో చల్లినా చీమలు రాకుండా ఉంటాయి. 
  • వేపుళ్ళు చేస్తున్నప్పుడు చెంచా వెనిగర్ చేర్చితే కూరగాయలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి.

  • వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.
  • మిగిలిపోయిన పాలను ఐస్‌ట్రేలో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డకట్టిన పాల బిళ్లలను టీ కాఫీలలో వాడుకోవచ్చు.
  • ఒక్కోసారి క్యారట్‌పైన ఎక్కువగా మట్టిపేరుకుపోతుంటుంది. అటువంటప్పుడు .. స్టీల్‌ స్క్రబర్‌తో రుద్ది కడిగితే, సులభంగా మట్టి వదులుతుంది.

  • టొమాటోలను పసుపు నీళ్లల్లో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కడిగి తుడిచిపెట్టుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
  • కేక్‌ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్‌స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్‌ పిక్‌ గుచ్చి, రిఫ్రిజిరేటర్‌లో పెడితే కేక్‌ పాడవకుండా తాజాగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement