Bread Slice
-
కేక్ మిగిలిపోయిందా? ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది
సెలెరీని సిల్వర్ ఫాయిల్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే రెండు మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది. చీమలు ఎక్కువగా ఉన్న చోట దాల్చిన చెక్క పొడిని నీటితో కలిపి స్ప్రే చేయడంతో చీమలు పారిపోతాయి. కాఫీ పౌడర్ లేదా మిరియాల పొడి నీళ్లలో కలిపి ఆ ప్రాంతంలో చల్లినా చీమలు రాకుండా ఉంటాయి. వేపుళ్ళు చేస్తున్నప్పుడు చెంచా వెనిగర్ చేర్చితే కూరగాయలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది. మిగిలిపోయిన పాలను ఐస్‌ట్రేలో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డకట్టిన పాల బిళ్లలను టీ కాఫీలలో వాడుకోవచ్చు. ఒక్కోసారి క్యారట్పైన ఎక్కువగా మట్టిపేరుకుపోతుంటుంది. అటువంటప్పుడు .. స్టీల్ స్క్రబర్‌తో రుద్ది కడిగితే, సులభంగా మట్టి వదులుతుంది. టొమాటోలను పసుపు నీళ్లల్లో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కడిగి తుడిచిపెట్టుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కేక్ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్‌స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్ పిక్ గుచ్చి, రిఫ్రిజిరేటర్లో పెడితే కేక్ పాడవకుండా తాజాగా ఉంటుంది. -
నోరూరించే చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారీ ఇలా!
చికెన్‌ను లొట్టలేసుకుంటూ లాగించేవాళ్లూ చాలా మందే ఉంటారు. రొటీన్‌గా చికెన్ కర్రీ, బిర్యానీ, కబాబ్ వంటివి కాకుండా కొత్త రుచులు కూడా కోరుకుంటారు చికెన్ ప్రియులు. అలాంటి వారి కోసమే ఈ రెసిపీ. ఎంచక్కా ఇంట్లోనే ఇలా చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారు చేసుకోండి. కావలసినవి: బోన్‌లెస్ చికెన్ ముక్కలు – 7 లేదా 8 (పలుచగా, చిన్నగా కట్ చేసుకోవాలి), బ్రెడ్ స్లైసెస్ – చికెన్ ముక్కలతో సమంగా (నలువైపులా బ్రౌన్ కలర్ ముక్కను తొలగించి, పక్కన పెట్టుకోవాలి), కారం, మసాలా, ఉప్పు – తగినంత, పసుపు, మిరియాల పొడి – కొద్దికొద్దిగా, స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్లు (నిమ్మరసం, ధనియాలపొడి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, చాట్ మసాలా కొద్దికొద్దిగా జోడించి, మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి), పెరుగు, చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్ల చొప్పున, నూనె – సరిపడా తయారీ: ముందుగా చికెన్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని.. అందులో కారం, మసాలా, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, పెరుగు వేసుకుని బాగా కలిపి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం ఇరువైపులా నాన్‌స్టిక్ మీద గ్రిల్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక్కో చికెన్ ముక్క ఒక్కో బ్రెడ్స్లైస్కి ఒకవైపు పెట్టుకుని.. పైన చీజ్ తురుము, స్వీట్ కార్న్ మిశ్రమం పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. మూడువైపులా తడి వేళ్లతో నొక్కి ఓపెన్ కాకుండా చూసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సాస్‌లో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. చదవండి: Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే! -
ఉప్మాలో.. బ్రెడ్ ఉప్మా వేరయా !
బ్రెడ్ ఉప్మా కావలసినవి : బ్రెడ్ పీసులు – 5 లేదా 7, గుడ్లు – 2, మినçప్పప్పు – అర టీ స్పూన్, క్యాప్సికం ముక్కలు – 3 టీ స్పూన్లు, క్యారెట్ తురుము – 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, జీడిపప్పు, వేరుశనగలు – 2 లేదా 3 టీ స్పూన్ల చొప్పున, ఉల్లిపాయ, టమాటా – ఒక్కొకటి చొప్పున (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, పసుపు – కొద్దిగా, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము, సన్న కారప్పూస – గార్నిష్ కోసం, నూనె – సరిపడా తయారీ : ముందుగా బ్రెడ్ పీసులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నూనె వేసుకోవాలి. అందులో జీడిపప్పు, వేరుశనగలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత పసుపు, గుడ్లు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుతూ బ్రెడ్ ముక్కలను కూడా వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర తురుము,సన్న కారప్పూసతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగాసర్వ్ చేసుకోవాలి. చర్రో బాంబ్స్ కావలసినవి : నీళ్లు – 1 కప్పుబటర్ – అర కప్పు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – అర టీ స్పూన్, మైదాపిండి – 1 కప్పు, గుడ్లు – 3, పంచదార పొడి – పావు కప్పు, దాల్చిన చెక్క పొడి – 1 టీ స్పూన్, డార్క్ చాక్లెట్ – 1 కప్పుహెవీ క్రీమ్ – 1 కప్పు (మార్కెట్లో దొరుకుతుంది. ఇంట్లోనే సిద్ధం చేసుకోవాలంటే.. పాలని చిన్న మంట మీద బాగా మరిగించి, మీగడని తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. మూడు నాలుగు రోజుల పాటు అలానే తీసుకుని, దాన్ని మిక్సీ పట్టుకుని వాడుకోవచ్చు) తయారీ : ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో నీళ్లు వేసుకుని కాస్త మరిగిన తర్వాత బటర్, పంచదార, ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. తర్వాత మైదాపిండి వేసుకుని గరిటెతో తిప్పుతూ.. దగ్గర పడేలా చేసుకుని స్టవ్ ఆప్ చేసుకుని, ఆ మిశ్రమంలో గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాటిక్ కవర్ని కోన్‌లా(అంగుళం పైనే హోల్ ఉండేలా) చేసుకుని అందులో ఆ మిశ్రమం మొత్తాన్ని నింపి.. సన్నగా వేలు పొడవున మరుగున్న నూనెలో పిండుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రలో హెవీ క్రీమ్ వేసుకుని బాగా మరిగించి.. వేడివేడిగానే చాక్లెట్ బౌల్లో వేసుకుని,గరిటెతో బాగా కలిపి క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. ఆ క్రీమ్‌లో ఈ రోల్స్‌ని కలిపి తింటే భలే టేస్టీగా ఉంటాయి. ఇడ్లీ మంచూరియా కావలసినవి : ఇడ్లీలు – 5 (ఒక్కో ఇడ్లీని 4 లేదా 5 ముక్కలు చేసుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఎండుమిర్చి పేస్ట్ – 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, వెనీగర్ – 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, టమాటా కెచప్ – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు – 5 టేబుల్ స్పూన్లు, నూనె – సరిపడా తయారీ : ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వెనిగర్, సోయా సాస్, టమాటా కెచప్, ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇడ్లీ ముక్కలు, మిరియాల పొడి వేసుకుని గరిటెతో బాగా తిప్పి.. ఉల్లికాడ ముక్కలు వేసుకుని ఒకసారి అటూ ఇటూగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. భలే ఉంది కదూ! -
కళ్లెదుటే టోస్టింగ్..!
వెజిబుల్ టోస్టర్.. అదేంటి? టోస్టర్ అంటే తెలుసు కానీ.. ఈ వెజిబుల్ టోస్టరేంటి అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. ఇప్పటి వరకు మన ఇళ్లల్లో ఉన్న టోస్టర్లలో బ్రెడ్ ముక్కను పెడితే.. అది లోపలే టోస్ట్ అయి బయటికి రావడం మనం చూశాం.. అవునా! కానీ ఇప్పుడు మనకు మరో సౌలభ్యం కూడా అందుబాటులోకి వచ్చేసింది. అదేమిటంటే ఈ వెజిబుల్ టోస్టర్లో బ్రెడ్ స్లయిస్‌ను పెట్టి బటన్ ఆన్ చేయగానే, లోపల జరిగే ప్రాసెస్ అంతా మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. బ్రెడ్ ఎలా వేడెక్కుతుంది.. ఎలా కాలుతుంది.. లాంటివన్నీ మనం బయటి నుంచి చూడొచ్చు. ఈ టోస్టర్ భలే తమాషాగా ఉంది కదూ.. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియంతో తయారు చేశారు. అంతేకాదు, మనకు లోపల జరిగే ప్రాసెస్ కనపడటం కోసం ముందు, వెనుక భాగాలు మాత్రం గాజుతో తయారు చేయబడి ఉంటాయి.