ఉప్మాలో.. బ్రెడ్‌ ఉప్మా వేరయా ! | Tasty Snacks Recipes In Sakshi Funday Magzine | Sakshi
Sakshi News home page

ఉప్మాలో.. బ్రెడ్‌ ఉప్మా వేరయా !

Published Sun, Oct 13 2019 11:45 AM | Last Updated on Sun, Oct 13 2019 12:40 PM

Tasty Snacks Recipes In Sakshi Funday Magzine

బ్రెడ్‌ ఉప్మా
కావలసినవి :  బ్రెడ్‌ పీసులు – 5 లేదా 7, గుడ్లు – 2, మినçప్పప్పు – అర టీ స్పూన్, క్యాప్సికం ముక్కలు – 3 టీ స్పూన్లు, క్యారెట్‌ తురుము – 4 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, జీడిపప్పు, వేరుశనగలు – 2 లేదా 3 టీ స్పూన్ల చొప్పున, ఉల్లిపాయ, టమాటా – ఒక్కొకటి చొప్పున (చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), ఆవాలు – అర టీ స్పూన్,  జీలకర్ర – పావు టీ స్పూన్,
పసుపు – కొద్దిగా, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము, సన్న కారప్పూస – గార్నిష్‌ కోసం, నూనె – సరిపడా

తయారీ : ముందుగా బ్రెడ్‌ పీసులను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌లో నూనె వేసుకోవాలి. అందులో జీడిపప్పు, వేరుశనగలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర,  పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్‌ తురుము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత పసుపు, గుడ్లు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుతూ బ్రెడ్‌ ముక్కలను కూడా వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. కొత్తిమీర తురుము,సన్న కారప్పూసతో గార్నిష్‌ చేసుకుని వేడి వేడిగాసర్వ్‌ చేసుకోవాలి.

చర్రో బాంబ్స్‌


కావలసినవి :  నీళ్లు – 1 కప్పుబటర్‌ – అర కప్పు, పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – అర టీ స్పూన్, మైదాపిండి – 1 కప్పు, గుడ్లు – 3, పంచదార పొడి – పావు కప్పు, దాల్చిన చెక్క పొడి – 1 టీ స్పూన్, డార్క్‌ చాక్లెట్‌ – 1 కప్పుహెవీ క్రీమ్‌ – 1 కప్పు (మార్కెట్‌లో దొరుకుతుంది. ఇంట్లోనే సిద్ధం చేసుకోవాలంటే.. పాలని చిన్న మంట మీద బాగా మరిగించి, మీగడని తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. మూడు నాలుగు రోజుల పాటు అలానే తీసుకుని, దాన్ని మిక్సీ పట్టుకుని వాడుకోవచ్చు)

తయారీ : ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాన్‌లో నీళ్లు వేసుకుని కాస్త మరిగిన తర్వాత బటర్, పంచదార, ఉప్పు వేసుకుని బాయిల్‌ చేసుకోవాలి. తర్వాత మైదాపిండి వేసుకుని గరిటెతో తిప్పుతూ.. దగ్గర పడేలా చేసుకుని స్టవ్‌ ఆప్‌ చేసుకుని, ఆ మిశ్రమంలో గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాటిక్‌ కవర్‌ని కోన్‌లా(అంగుళం పైనే హోల్‌ ఉండేలా) చేసుకుని అందులో ఆ మిశ్రమం మొత్తాన్ని నింపి.. సన్నగా వేలు పొడవున మరుగున్న నూనెలో పిండుతూ డీప్‌ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని ఒక పాత్రలో హెవీ క్రీమ్‌ వేసుకుని బాగా మరిగించి.. వేడివేడిగానే చాక్లెట్‌ బౌల్‌లో వేసుకుని,గరిటెతో బాగా కలిపి క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. ఆ క్రీమ్‌లో ఈ రోల్స్‌ని కలిపి తింటే  భలే టేస్టీగా ఉంటాయి.

ఇడ్లీ మంచూరియా


కావలసినవి :  ఇడ్లీలు – 5 (ఒక్కో ఇడ్లీని 4 లేదా 5 ముక్కలు చేసుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్, ఎండుమిర్చి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, వెనీగర్‌ – 1 టేబుల్‌ స్పూన్, సోయా సాస్‌ – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, టమాటా కెచప్‌ – 1 టేబుల్‌ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు – 5 టేబుల్‌ స్పూన్లు, నూనె – సరిపడా

తయారీ : ముందుగా 2 టేబుల్‌ స్పూన్ల నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వెనిగర్, సోయా సాస్, టమాటా కెచప్, ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇడ్లీ ముక్కలు, మిరియాల పొడి వేసుకుని గరిటెతో బాగా తిప్పి.. ఉల్లికాడ ముక్కలు వేసుకుని ఒకసారి అటూ ఇటూగా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.  భలే ఉంది కదూ! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement