కళ్లెదుటే టోస్టింగ్..!
వెజిబుల్ టోస్టర్.. అదేంటి? టోస్టర్ అంటే తెలుసు కానీ.. ఈ వెజిబుల్ టోస్టరేంటి అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. ఇప్పటి వరకు మన ఇళ్లల్లో ఉన్న టోస్టర్లలో బ్రెడ్ ముక్కను పెడితే.. అది లోపలే టోస్ట్ అయి బయటికి రావడం మనం చూశాం.. అవునా! కానీ ఇప్పుడు మనకు మరో సౌలభ్యం కూడా అందుబాటులోకి వచ్చేసింది. అదేమిటంటే ఈ వెజిబుల్ టోస్టర్‌లో బ్రెడ్ స్లయిస్‌ను పెట్టి బటన్ ఆన్ చేయగానే, లోపల జరిగే ప్రాసెస్ అంతా మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. బ్రెడ్ ఎలా వేడెక్కుతుంది.. ఎలా కాలుతుంది.. లాంటివన్నీ మనం బయటి నుంచి చూడొచ్చు.
ఈ టోస్టర్ భలే తమాషాగా ఉంది కదూ.. దీన్ని స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియంతో తయారు చేశారు. అంతేకాదు, మనకు లోపల జరిగే ప్రాసెస్ కనపడటం కోసం ముందు, వెనుక భాగాలు మాత్రం గాజుతో తయారు చేయబడి ఉంటాయి.