మాట్లాడుతున్న డీపీఓ నారాయణ
-
డీపీఓ నారాయణరావు
ఖమ్మం జెడ్పీసెంటర్ : గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డీఎల్‌పీఓ రామయ్యతో కలిసి సెక్రటరీలు, ఈఓఆర్డీలతో పంచాయతీల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైందని, గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేపట్టాలని, అన్ని గ్రామాల్లో బ్లీచింగ్‌ను స్టాక్ పెట్టుకుని ఎప్పటికప్పుడు చల్లిస్తూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. మంచినీటి పథకాల నిర్వహణ సక్రమంగా చూడాలని చెప్పారు. ప్రతీ వారం వాటర్ ట్యాంక్‌లు శుభ్రం చేయాలని, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సెక్రటరీలదేనని సూచించారు. గ్రామజ్యోతి కార్యకలాపాలను ప్రియాసాఫ్ట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పంచాయతీలకు సంబంధించిన ప్రతీ ఖర్చు జమలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లలో 500 పంచాయతీలకు పైగా వందశాతం కలెక్షన్లు సాధించాలని చెప్పారు. పంచాయతీల్లో ఆడిట్ అభ్యంతరాలు లేకుండా చూడాలని, అభ్యంతరాలు ఉంటే వెంటనే క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు.