సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వరుసగా రికార్డుల మోతమోగుతోంది. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా దేశీయ సూచీలు సరికొత్త రికార్డుల వద్ద ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 34,400 దాటగా నిఫ్టీ కూడా ప్రస్తుతం ఆరంభ లాభాలనుంచి స్వల్పంగా వెనక్కి తగ్గిన మార్కెట్లు ఫ్లాట్‌గా మారాయి.ప్రస్తుతం మళ్లీ లాభాల్లోకి మళ్లి 52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 34404 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 10627వద్ద ట్రేడ్ అవుతోంది.
కోల్ ఇండియా, అశోక్ లేలాండ్, గెయిల్, జీఎస్‌కే కన్జ్యూమర్, రేమాండ్ , అరవింద్ మిల్స్, విప్రో, టాటా మెటార్స్ లాభపడుతున్నాయి. ఎన్‌ఎండీసీ, ఐషర్ మోటార్స్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, ఆర్‌కామ్,ఎస్‌బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment