
హైదరాబాద్: రైతులు, వినియోగదారుల మేలుకే ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మియాపూర్ ఆల్విన్ ప్రజయ్‌సిటీలో ఏర్పాటు చేసిన ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, రసమయి బాలకిషన్, కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్‌తో కలసి ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, నగర ప్రజలకు కూరగాయలు సరసమైన ధరలకు దొరకడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రైతుకు గిట్టు బాటు ధర కల్పించేందుకు తాజా∙కూరగాయలను కొనుగోలు చేసి తక్కువ ధరలకు ‘మన కూరగాయలు’ కేంద్రంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.