
చికెన్ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చినా, పార్టీకి వెళ్లినా చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అదే చికెన్‌ని రోజు తినాలంటే ఎవరికైనా సాధ్యం కాదు పైగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ మొన్రో అనే యువతి మాత్రం గత 22 ఏళ్ల నుంచి రోజు చికెన్ మాత్రమే తింటోంది. తన రోజువారి డైట్‌లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయి.
అయితే దీనికి కారణం కూడా ఉందని అంటోంది సమ్మర్ మొన్రో. ఆమె మాట్లాడుతూ.. గత 22 ఏళ్ల నుంచి తను పండ్లు తినకున్నా.. కూరగాయలు తినకున్నా చాలా ఆరోగ్యంగా ఉందట. ఎలాంటి సమస్యలు తనకు రాలేదట. మూడు సంవత్సరాల వయస్సులో మెత్తని బంగాళాదుంపలను తినాల్సి వచ్చినప్పుడు ఆమెకు ఫోబియా మొదలైనట్లు చెప్పుకొచ్చింది. సమ్మర్ తన ఫోబియా నుంచి బయటపడేందుకు రెండుసార్లు థెరపీని, హిప్నోథెరపీని ప్రయత్నించింది, కానీ అదేది ఆమెకు సహాయం చేయలేదట.
అందుకే తాను పండ్లు, కూరగాయలు తినడం మానేసినట్లు చెప్పింది. అసలు అవి చివరిసారిగా ఎప్పుడు తిన్నానో కూడా తనకు గుర్తులేదని తెలిపింది. అయితే తను పాటిస్తున్న డైట్ తనని ఆరోగ్యంగా ఉంచుతోందని అందుకే.. కేవలం చికెన్‌తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment