
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీనటి సమంత చెన్నైలో కూరగాయల్ని అమ్మారు. సమంత కూరగాయలు అమ్మడం ఏంటా అని అలోచిస్తున్నారా? విషయం ఏమిటంటే.. ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నటి సమంత అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం కోసం నిధులను సేకరిస్తున్నారు.
రెండురోజుల క్రితం చెన్నైకి వచ్చిన సమంత సేవా కార్యక్రమాలకు నిధులను సమీకరించే నిమిత్తం గురువారం సాయంత్రం ట్రిప్లికేన్‌లోని జామబజార్‌కు చేరుకున్నారు. అకస్మాత్తుగా అక్కడే రోడ్డుపై ఉన్న ఒక కూరగాయల దుకాణం ముందు కూర్చుని దుకాణ యజమానికి విషయం చెప్పారు. సమంత రాకతో జనం చుట్టూ గూమిగూడగా వచ్చేపోయే వారికి కూరగాయలు తూకం వేస్తూ సమంత అమ్మసాగారు. కిలో ఎంత అని అడగకుండా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి పలువురు సమంత దగ్గర కూరగాయలు కొన్నారు. నిమిషాల వ్యవధిలో కూరగాయలన్నీ ఖాళీ అయిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment