
సమంత మంచి ఆర్టిస్ట్. విమర్శకుల నుంచి వీరాభిమానుల వరకూ ఆమె నటనకు అందరూ ఫుల్ మార్క్స్ వేస్తుంటారు. అయితే ఫుల్ మార్క్స్ కొట్టేసే అలవాటు సమంతకు స్కూల్ రోజుల నుంచే ఉన్నట్లుంది. స్కూల్‌లో ఆమె మెరిట్ స్టూడెంట్ అట. బాగా చదివి మంచి మార్కులు కొట్టేసిన విషయాన్ని సమంతే స్వయంగా పంచుకున్నారు. స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారామె. పదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో 1000కి 887 మార్కులు సాధించారు సమంత. ఆమె క్లాస్ ఫస్ట్. ‘‘తను చాలా బాగా చదువుతోంది. మన స్కూల్‌కి గర్వకారణం’’ అని ప్రోగ్రెస్ కార్డ్‌లో సమంత క్లాస్ టీచర్ ఆమె గురించి రాశారు.. సమంత తన పదవ తరగతిని చెన్నైలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో చదువుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment