merit student
-
పేద విద్యార్థికి ఎన్నారై చేయూత.. ఐఐటీలో సీటు
ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా): పేద విద్యార్థికి చేయూతనిచ్చి ఓ ఎన్నారై ఉదారత చాటుకున్నాడు. నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన అడె సుదర్శన్–విజయ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరి కుమారుడు చంద్రకాంత్ ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లోనూ సత్తాచాటాడు. ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 787 ర్యాంక్ సాధించాడు. ఐఐటీ జోధ్‌పూర్‌లో సీటు లభించింది. సరస్వతీ కరుణ ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చంద్రకాంత్ ఐఐటీలో ప్రవేశరుసుం కట్టే ఆర్థిక స్తోమత లేక ఇంటివద్దనే ఉండి పోయాడు. విషయం తెలుసుకున్న ఇచ్చోడకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మౌనిక రాథోడ్ ఇటీవల ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. మంత్రి సన్నిహితుడి ద్వారా విషయం తెలుసుకున్న యూఎస్‌లో స్థిరపడ్డ ఎన్నారై శశికాంత్ స్పందించాడు. కనపర్తి ఐఐటీ జోధ్‌పూర్‌లో ప్రవేశరుసుం కట్టి చంద్రకాంత్‌ను చేర్పించాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు, సాయం అందించిన ఎన్నారై శశికాంత్‌కు, అలాగే మౌనిక రాథోడ్‌కు చంద్రకాంత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?) -
మెరిట్ స్టూడెంట్
సమంత మంచి ఆర్టిస్ట్. విమర్శకుల నుంచి వీరాభిమానుల వరకూ ఆమె నటనకు అందరూ ఫుల్ మార్క్స్ వేస్తుంటారు. అయితే ఫుల్ మార్క్స్ కొట్టేసే అలవాటు సమంతకు స్కూల్ రోజుల నుంచే ఉన్నట్లుంది. స్కూల్లో ఆమె మెరిట్ స్టూడెంట్ అట. బాగా చదివి మంచి మార్కులు కొట్టేసిన విషయాన్ని సమంతే స్వయంగా పంచుకున్నారు. స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారామె. పదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో 1000కి 887 మార్కులు సాధించారు సమంత. ఆమె క్లాస్ ఫస్ట్. ‘‘తను చాలా బాగా చదువుతోంది. మన స్కూల్‌కి గర్వకారణం’’ అని ప్రోగ్రెస్ కార్డ్‌లో సమంత క్లాస్ టీచర్ ఆమె గురించి రాశారు.. సమంత తన పదవ తరగతిని చెన్నైలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్లో చదువుకున్నారు. -
బీసీ విద్యార్థులకు సర్కారు బొనాంజ
వెనుకబడిన తరగతుల వారికి విదేశీ విద్య కింద అందజేసే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులతో ఎంతోమందికి బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమలుకానుంది. విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసి ఇటీవల ఎంపికైన వారికి ఈ మొత్తం అందనుంది. ఆర్థిక సాయం పెంపుతో బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, అమరావతి ఎంపిక విధానం - ఏపీ ఈపాస్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. - 33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. - వారు లేని పక్షంలో పురుషులకు అవకాశం కల్పిస్తారు. - బీసీల్లో ఏ, బీ, డీ గ్రూపుల వారికి నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆర్థిక సాయానికి నిబంధనలివీ.. - పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు వీలుగా ఏటా వెయ్యి మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు.. - అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలలోపు ఉండాలి. ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, వారి సంవత్సర ఆదాయం కూడా ఆరు లక్షలకు మించకూడదు. - దరఖాస్తు చేసిన సంవత్సరం జూలై ఒకటి నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించరాదు. ఏఏ దేశాల్లో చదువుకోవచ్చు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా (ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా దేశాల్లో కేవలం మెడిసిన్ చదువుకునేందుకు మాత్రమే అనుమతి). సెలక్షన్ కమిటీలో ఎవరెవరు కమిటీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉంటారు. సభ్యులుగా ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉంటారు. స్కాలర్షిప్ ఇచ్చే విధానం - విద్యార్థి ల్యాండింగ్ పర్మిట్ చూపించగానే రూ.5లక్షలు మొదటి దఫాగా ఇస్తారు. - సెప్టెంబర్ రిజల్ట్ రాగానే రెండో దఫా రూ.5లక్షలు ఇస్తారు. - చదువుకున్న విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇలా.. - రూ.10 లక్షలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చేవారు. - ప్రపంచంలోని 15 యూనివర్సిటీలు, కాలేజీల్లో మాత్రమే చదువుకునేందుకు అనుమతి ఇప్పుడు ఇలా.. - రూ.15 లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇస్తారు. - రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఎక్కడైనా చదువుకోవచ్చు. - సీటు రాగానే అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు అర్హులు. మెరిట్ విద్యార్థులకు సువర్ణావకాశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు దోహదపడుతుంది. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి రూ.15లక్షల రూపాయలు అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకంలో ఆర్థిక సాయం అందిస్తాం. విదేశాల్లో అత్యున్నత వర్సిటీల్లో బీసీ విద్యార్థులకు విద్యను అందించాలని సర్కారు భావించడం గొప్ప నిర్ణయం. మెరిట్ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణావకాశం. – బి. రామారావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ -
సీన్ రివర్స్; యువతి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: ప్రేమ... పెళ్లి.... పగ... దాడి... హత్య... ఆత్మహత్య... రాష్ట్ర వ్యాప్తంగా వరుసపెట్టి ఇలాంటి ఉదంతాలే వెలుగు చూస్తున్నాయి. వీటిలో కొన్ని నగరంలోనూ చోటు చేసుకుంటున్నాయి. ఈ సిరీస్‌కు కొంత డిఫరెంట్‌గా రెండు లవ్‌స్టోరీలు సిటీ పోలీసు కమిషనరేట్‌లోని ఓ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ఓ యువతి వేధింపులు తట్టుకోలేక మెరిట్ స్టూడెంట్ పూర్‌గా మారిపోగా... మరో యువతి తనపై ‘వివక్ష’ చూపిందంటూ భగ్న ప్రేమికుడు ఠాణాకు ఎక్కాడు. చట్ట పరిధిలోకి రావంటూ పోలీసులు చెప్పిన అభిప్రాయంతో మౌఖిక ఫిర్యాదుల వద్దే ఆగిపోయిన ఈ రెండు ప్రేమ కథా విచిత్రాలూ రికార్డుల్లోకి ఎక్కలేదు. ఆ యువకుడి విషయంలో సీన్ రివర్స్... యువకులు ప్రేమ పేరుతో యువతుల వెంటపడటం, వారు తిరస్కరిస్తే వివిధ రకాలుగా వేధించడం... ఇలాంటి కేసులు తరచు పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతూనే ఉంటాయి. దీనికి పూర్తి భిన్నమైన కథ ఈ యువకుడిది. ఓ వైద్యురాలి కుమారుడైన ఇతగాడు ఆది నుంచి మెరిట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్‌ను 95 శాతం మార్కులతో పాసయ్యాడు. ఈ యువకుడినీ వైద్యుడినే చేయాలని భావించిన ఆ వైద్యురాలు నీట్ కోచింగ్ కోసం పశ్చిమ మండల పరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. కొన్నాళ్ల పాటు ఇతడి కోచింగ్ సజావుగానే సాగింది. ఇతడితో పాటే కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతికి మూర్ఛరోగం ఉంది. ఓ సందర్భంలో క్లాసులోనే కుప్పకూలిన ఆమెకు ఇతగాడు సాయం చేశాడు. అప్పటి నుంచి ఆ యువతి ప్రేమ పేరుతో అతడి వెంట పడడం ప్రారంభించింది. ఓ దశలో ఆమె వేధింపులు వాట్సాప్ వరకువెళ్ళాయి. అభ్యంతరకరమైన, అశ్లీల ఫొటోలు, సందేశాలతో అతడిని పూర్తిగా డిస్ట్రబ్ చేయడం మొదలెట్టింది. దీంతో ‘హీరో’ లాంటి స్టూడెంట్ మార్కులు ‘జీరో’లకు పడిపోయాయి. ఈ విషయం గమనించిన వైద్యురాలు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఆమె పోలీసుస్టేషన్‌కు వచ్చి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఇలా అయితే చట్టపరిధిలోకి రాదని పోలీసులు చెప్పడంతో తమ పేర్లు రికార్డుల్లోకి ఎక్కడ ఇష్టం లేని ఆమె ఫిర్యాదు ప్రయత్నం విరమించుకున్నారు. చివరకు కుమారుడి నుంచి స్మార్ట్‌ఫోన్, పాత ఫోన్ నెంబర్ లాక్కుని ఆంధ్రప్రదేశ్‌కు పంపి మరో ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఆ ఫిర్యాదు చూసి అవాక్కైన పోలీసులు... ఈ భగ్న ప్రేమికుడి వ్యవహారం మరోలా ఉంది. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన యువకుడు ఉద్యోగం కోసం నగరానికి వలసవచ్చాడు. ఇతడికి పరిచయమైన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి కొన్నాళ్ల పాటు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. హఠాత్తుగా వీరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టంది. ఇతగాడి వ్యవహారశైలి నచ్చకో, పెళ్ళికి పెద్దలు నిరాకరించో, మరే ఇతర కారణమో కానీ ఆమె అతగాడికి దూరంగా ఉండటం మొదలెట్టింది. అయినప్పటికీ పట్టు వదలని ఈ యువకుడు కొన్ని రోజుల పాటు నిర్విరామంగా ఆమె వెంట పడ్డాడు. చివరకు ఆమెకు వివాహం నిశ్చయమైందని తెలియడంతో ఆమెపై ‘కక్ష’ కట్టాడు. ఇది తీర్చుకోవడానికి ‘లిఖిత పూర్వకంగా’ ఠాణా తలుపుతట్టాడు. ఆ ఫిర్యాదును చూసిన పోలీసులకు మతి పోయినంత పనైంది. దాదాపు రెండేళ్ళ పాటు ఆమె తనతో సన్నిహితంగా మెలిగిందని, అయితే ఓ దశలో ‘తన బ్యాగ్రౌండ్’ తెలిసిన తర్వాతే దూరంగా పెట్టడం మొదలెట్టిందని అందులో పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా వివక్ష కిందికే వస్తుందంటూ పేర్కొన్న ఆ భగ్న ప్రేమికుడు ఆమెపై కేసు నమోదు చేయాలని కోరాడు. అంతటితో ఆగకుండా ఆమెపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులకు అల్టిమేటం ఇచ్చాడు. అయితే ఈ ఆరోపణలపై అలా కేసులు నమోదు, చర్యలు తీసుకోవడం కుదరదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అతగాడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. -
ఇంటర్నల్ మార్కులు తారుమారు
- టెన్త్ ఇంటర్నల్ మార్కుల అప్లోడింగ్లో దొర్లిన తప్పు - ఇద్దరూ ఒకే పేరుతో ఉండడంతో సిబ్బంది తప్పిదం - సవరణకు ఏపీ ఆన్లైన్లో లేని ఆప్షన్ వెల్దుర్తి రూరల్ : ఒకే సెక్షన్.. ఒకే తరగతి.. ఒకే పేరు.. తేడా ఉన్నదంతా తండ్రి పేరు మాత్రమే. ఇలాంటి వారి మార్కుల నమోదు విషయంలో స్కూల్ సిబ్బంది చేసిన పొరపాటు మెరిట్ విద్యార్థికి గ్రహపాటుగా మారింది. టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదులో తారుమారు కావడం ఇందుకు కారణం. ఇందుకు వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ వేదికగా మారింది. జి. రాజేశ్ పేరుతో ఇద్దరు విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇందులో ఒకరు బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన గిడ్డయ్య కుమారుడు(ఐడీ నెంబరు 6261504) పట్టణంలోని బాలుర హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అన్నింటా ఏ1 గ్రేడ్ మార్కులు సాధించాడు. మరొకరు వెల్దుర్తికే చెందిన జి. దేవేంద్రుడి కుమారుడు జి.రాజేశ్(ఐడీ నెంబరు 6267823). ఈ విద్యార్థి మార్కుల సాధనలో పూర్. వీరి మార్కుల ఆన్లైన్ నమోదులో ఉపాధ్యాయులు, సిబ్బంది చేసిన తప్పిదం కారణంగా ఒకరి మార్కులు ఒకరికి పడ్డాయి. హాస్టల్ వార్డెన్ దొరస్వామి విజ్ఞప్తి మేరకు హెచ్ఎం మధు.. విద్యార్థుల మార్కుల సవరణకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎంఈఓ రామ్మోహన్‌ను కోరారు. అయితే సవరణ గడువు శుక్రవారంతో ముగియడంతో ఆయన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన మార్కులు తనకు వేసి న్యాయం చేయాలని బాధిత విద్యార్థి కోరుతున్నాడు.